epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

‘గ్యాస్​ స్టవ్’​ సాక్షిగా ఇద్దరు యువతుల పెళ్లి..

కలం, వెబ్​ డెస్క్​ : పెళ్లంటే పందిళ్లు, భాజా బజంత్రీలు, వేద మంత్రాలు, అగ్ని సాక్షిగా ఏడు అడుగులు.. ఇలాంటి ఘట్టాలు గుర్తుకు వస్తాయి. సాధారణంగా అమ్మాయి అబ్బాయి వివాహం చేసుకున్నప్పుడు ఇలాంటివి చేస్తారు. కానీ బీహార్​లో జరిగిన ఓ వింత వివాహం (Two Women Marriage) ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అబ్బాయిలంటే ఇష్టం లేని ఇద్దరు యువతులు పెళ్లి చేసుకున్నారు. అది కూడా ఎలాంటి ఏర్పాట్లు లేకుండా వంటగదిలోని ‘గ్యాస్​ స్టవ్​’ సాక్షిగా ఏడడుగులు వేసి ఒక్కటయ్యారు.

బీహార్​లోని సుపాల్​ జిల్లాకు చెందిన పూజా గుప్తా (21), కాజల్​ కుమారి (18) అనే ఇద్దరు అమ్మాయిలకు ఇన్​ స్టాగ్రామ్ లో ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఒకరినొకరు వదలలేని స్థితికి చేరుకున్నారు. ఈ క్రమంలో సమాజం ఏమనుకున్నా పెళ్లి చేసుకోవాలని డిసైడ్​ అయ్యారు. మగాళ్లపై ఆసక్తి లేకపోవడంతోనే తాము ఒకరికొకరు తోడుగా ఉండాలని నిర్ణయించుకున్నారు. దీంతో గ్యాస్​ స్టవ్​ సాక్షిగా దర్మార్ద, కామ, మోక్షంలో తోడుంటానంటూ ప్రమాణం చేస్తూ ఏడడుగులు వేశారు. చనిపోయే వరకు కలిసి ఉంటామని ప్రమాణం చేశామని తెలిపారు. అయితే, Two Women Marriage ప్రస్తుతం జిల్లాతో పాటు దేశంలో హాట్​ టాపిక్​ గా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>