epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

తెలంగాణలో మరో పరువు హత్య

కలం, వెబ్​డెస్క్​: తెలంగాణలో మరో పరువు హత్య (Honour Killing) జరిగింది. వేరే కులం యువకుడిని ప్రేమించిందని కన్న కూతుర్ని కిరాతకంగా హత్య చేశారు తల్లిదండ్రులు. ఈ సంఘటన కరీంనగర్(Karimnagar)​ జిల్లా సైదాపూర్​ మండలంలో కలకలం సృష్టించింది. కేసుకు సంబంధించిన వివరాలను హూజూరాబాద్​ ఏసీపీ మాధవి గురువారం వెల్లడించారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక పదిరోజుల కిందట చనిపోయింది. కడుపు నొప్పి తాళలేక తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులు ఈ నెల 14న పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో ఇది పరువు హత్యగా తేలింది. అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు, బాలిక ప్రేమించుకున్నారు. విషయం తెలియడంతో తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. కూతురుకు బలవంతంగా పురుగుల మందు తాగించి, ఆపై గొంతు నులిమి చంపేశారు. విచారణలో హత్య చేసినట్లు నిందితులు అంగీకరించడంతో పోలీసులు అరెస్టు చేశారు.

Read Also: ట్యాపింగ్ విషయం ఎప్పుడు తెలిసింది? : మాజీ డీజీపీని ప్రశ్నించిన సిట్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>