epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

లైన్ లో ఆ నలుగురు.. అనిల్ నెక్ట్స్ మూవీ ఎవరితో..?

కలం, సినిమా : అనిల్ రావిపూడి (Anil Ravipudi).. సినిమా తీశాడంటే.. బొమ్మ బ్లాక్ బస్టరే. పటాస్ సినిమా దగ్గర నుంచి విజయ యాత్రను కొనసాగిస్తున్నాడు. ఈ సంక్రాంతికి మన శంకర్ వరప్రసాద్ గారు అంటూ వచ్చాడు. మెగాస్టార్ చిరంజీవితో పాటు విక్టరీ వెంకటేష్ కూడా నటించడంతో అభిమానులే కాదు.. కామన్ ఆడియన్స్ సైతం ఈ సినిమా చూడాలి అనుకున్నారు. అంచనాలకు తగ్గట్టుగానే వరప్రసాద్.. బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేయబోతున్నాడు. ఇదిలా ఉంటే.. అనిల్ నెక్ట్స్ ఏంటి..? ఇప్పుడు ఇదే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది..

సీనియర్ హీరోల్లో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లతో అనిల్ రావిపూడి సినిమాలు చేయడం.. అవి బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించడం తెలిసిందే. ఇక ఆ నలుగురిలో నాగార్జునతో సినిమా చేయాలి. అనిల్ రావిపూడి నాగ్ తో సినిమా చేస్తే.. అరుదైన రికార్డ్ తన సొంతం అవుతుందని ఇటీవల ఓ ఇంటర్ వ్యూలో చెప్పాడు. అందుచేత అనిల్ రావిపూడి నెక్ట్స్ నాగ్ తోనే ఉంటుందని టాక్ వినిపించింది. అయితే… ఇప్పుడు అనిల్ రావిపూడితో సినిమా చేసే ఛాన్స్ ఉన్న హీరోలు మరో ముగ్గురు ఉన్నారని ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.

ఇంతకీ ఆ ముగ్గురు ఎవరంటే.. ముందుగా చెప్పాల్సింది వెంకటేష్. సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి సీక్వెల్ చేస్తామని ఆ మధ్య ప్రకటించారు. వెంకీ అనిల్ తో ఈ సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ గానే ఉన్నారు. అయితే.. ఇప్పుడు వెంకీ.. త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత దృశ్యం 3 చేయాల్సి వుంది. అందుచేత వెంకీతో అనిల్ సినిమా సెట్స్ పైకి రావడానికి టైమ్ పడుతుందని టాక్. మరో హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌. దిల్ రాజు బ్యానర్ లో పవన్ మరో సినిమా చేస్తానని మాట ఇచ్చారు. దిల్ రాజు పవన్ కోసం కథ రెడీ చేయమని Anil Ravipudi ని అడిగారని.. ఈ కాంబో సెట్ అయ్యే ఛాన్స్ ఉందని ప్రచారం జరిగింది. అయితే.. పవన్ తో సినిమా అంటే.. ఇప్పట్లో జరిగే పని కాదు. ఇక మిగిలింది మాస్ మహారాజా రవితేజ. ఈ హీరోతో కూడా అనిల్ సినిమా చేయాల్సివుంది. మరి.. నాగ్, వెంకీ, పవన్, రవితేజ.. ఈ నలుగురిలో ఎవరితో సెట్ అవుతుందో చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>