కలం, వెబ్ డెస్క్: సమాజంలో అనేక అవమానాలను ఎదుర్కొంటున్న ట్రాన్స్ జెండర్ల (Transgender)కు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఇప్పటికే ట్రాఫిక్ హోంగార్డులుగా, జీహెచ్ఎంసీలో పలు కీలక విభాగాల్లో ట్రాన్స్‌జెండర్లను నియమించింది. ట్రాన్స్‌జెండర్లు కూడా ప్రభుత్వం కల్పించిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ సమర్థమంతమైన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ కోఅప్షన్లలో ట్రాన్స్‌జెండర్లకు ప్రాతినిధ్యం కల్పించాలని ప్రకటించడంతో హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి ధన్యావాదాలు తెలుపుతూ జగిత్యాల (Jagtial) జిల్లా కేంద్రంలో చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.


