కొవిడ్ మరణాల లెక్క తేలింది.. ప్రపంచ ఆరోగ్య సంస్థ రిపోర్ట్

కలం, వెబ్ డెస్క్ : కొవిడ్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా 2020-23 మధ్య కాలంలో 70 లక్షల మంది మాత్రమే చనిపోయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇంతకాలం అధికారికంగా లెక్కలు ప్రచురించింది. కానీ ఇటీవల అన్ని దేశాల్లోని గణాంకాలను విశ్లేషించిన తర్వాత కొవిడ్ కారణంగా మొత్తం 2.21 కోట్ల మంది చనిపోయినట్లు తేల్చింది. ప్రతీ ఒక కొవిడ్ మృతి ఘటనలో ఇద్దరి వివరాలు అధికారికంగా రికార్డు కాలేదని వివరించింది. కొవిడ్ మృతుల సంఖ్యను ఉద్దేశపూర్వకంగానే చాలా దేశాలు తక్కువ చేసి చూపించాయని తాజా నివేదికలో WHO వెల్లడించింది.

మృతుల విషయంలో ‘కొవిడ్ కారణంగానే చనిపోయారు’ అని ధృవీకరించలేదని, ఇతర కారణాలు ప్రస్తావించడంతో ఆ మృతులు కొవిడ్ మరణాల జాబితాలోకి చేరలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరించింది. ఆర్థికపరమైన అంశాలు, సహజ మరణం, అనారోగ్యం.. ఇలాంటి కారణాలతో ఆ మరణాలను కొవిడ్ జాబితాలో చేర్చలేదని స్పష్టత ఇచ్చింది. కొవిడ్ పాండమిక్ కాలంలో ఎక్కువగా 2021 సంవత్సరంలోనే 1.04 కోట్ల మంది చనిపోయారని, రూపాంతరం చెంది డెల్టా లాంటి పేర్లతో వైరస్ ప్రమాదకరంగా మారడంతో ఈ కాలంలోనే ఎక్కువ మరణాలు సంభవించినట్లు వివరించింది. క్రమంగా వైరస్ వేరియంట్ బలహీనపడిందని, 2023 నాటికి 40 లక్షల మంది మాత్రమే మరణించినట్లు రిపోర్టు అయిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తన తాజా నివేదికలో వివరించింది.

మొత్తం కొవిడ్ మరణాల్లో 6.2 శాతం మాత్రమే తొలి సంవత్సరం (2020లో) నమోదు కాగా ఆ తర్వాతి సంవత్సరం (2021లో) మూడు రెట్లు పెరిగి 18% నమోదైనట్లు తెలిపింది. కొవిడ్ మృతుల్లో 57 శాతం మంది పురుషులని తెలిపింది. వయసును పరిగణనలోకి తీసుకుంటే దాదాపు మూడింట రెండొంతుల మంది 65 ఏండ్ల వయసు పైబడినవారేనని, ఆ తర్వాతి స్థానంలో 23% మంది 45-64 ఏండ్ల మధ్య ఉన్నవారని వివరించింది. ప్రతీ లక్ష మంది కొవిడ్ మృతుల్లో దాదాపు 34 వేల మంది 55-59 ఏండ్ల మధ్య ఉన్నవారేనని తెలిపింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>