కలం, వెబ్ డెస్క్: భారతీయ సినీ పరిశ్రమలో కేవలం స్టార్‌డమ్ మాత్రమే కాదు, వ్యాపార పెట్టుబడులు కూడా భారీ సంపదను సృష్టిస్తాయని లేటెస్ట్ రిపోర్ట్స్ స్పష్టం చేస్తున్నాయి. సినీ తారలు కేవలం నటనకే పరిమితం కాకుండా ప్రొడక్షన్ హౌస్‌లు, స్పోర్ట్స్ టీమ్స్, రియల్ ఎస్టేట్ రంగాల్లో పెట్టుబడులు పెట్టి బిలియన్ డాలర్ల సామ్రాజ్యాలను నిర్మిస్తున్నారు. ఈ జాబితాలో (Top Richest Actors) బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ సుమారు రూ. 12,490 కోట్ల నికర విలువతో అగ్రస్థానంలో నిలిచారు. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్, కోల్‌కతా నైట్ రైడర్స్ వంటి సంస్థల ద్వారా ఆయన తన సంపదను భారీగా పెంచుకున్నారు.
రెండో స్థానంలో నటి జూహీ చావ్లా నిలిచారు. ప్రస్తుతం సినిమాల్లో చురుగ్గా లేకపోయినప్పటికీ, వ్యాపార రంగంలో ఆమె రాణిస్తున్నారు. సుమారు రూ. 7,790 కోట్ల ఆస్తులతో ఆమె భారతదేశపు అత్యంత ధనిక నటిగా గుర్తింపు పొందారు. నైట్ రైడర్స్ గ్రూప్‌లో భాగస్వామిగా ఉండటం, ఇతర వ్యాపార సంస్థల్లో పెట్టుబడులు ఆమెను ఈ స్థాయికి చేర్చాయి. ఆమె తర్వాత స్థానంలో హృతిక్ రోషన్ సుమారు రూ. 3,100 కోట్ల సంపదతో మూడవ స్థానంలో నిలిచారు. తన సొంత బ్రాండ్ HRX, ఇతర వ్యాపారాల ద్వారా ఆయన ఈ స్థాయికి చేరుకున్నారు.
జాబితాలో తర్వాతి స్థానాల్లో అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్ (Salman Khan) నిలిచారు. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ సుమారు రూ. 1,600 కోట్ల నుంచి రూ. 3,000 కోట్ల మధ్య నికర విలువతో నాలుగో స్థానంలో ఉండగా, సల్మాన్ ఖాన్ సుమారు రూ. 2,900 కోట్ల ఆస్తులతో ఐదో స్థానంలో కొనసాగుతున్నారు. అలాగే టాలీవుడ్ హీరో నాగార్జున నికర ఆస్తుల విలువ సుమారు రూ. 5,000 కోట్లు. ఆయన భారతదేశంలోనే సంపన్న నటులలో ఒకరిగా పేరు దక్కించుకున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, రియల్ ఎస్టేట్, బిగ్ బాస్ లాంటివి నాగార్జునకు సంపాదనను తెచ్చిపెడుతున్నాయి. వీరు కేవలం రెమ్యూనరేషన్ ద్వారానే కాకుండా, బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, వ్యాపారాల ద్వారా భారీగా ఆర్జిస్తున్నారు.
Read Also: చక్కెరతో ముసలితనం.. యవ్వనాన్ని హరిస్తున్న తీపి రక్కసి!
Follow Us On : WhatsApp

