Mobile Popup Ad
Mobile Popup Ad

విజయ్ కులమేంటి? విపరీతంగా సెర్చ్ చేస్తున్న నెటిజన్లు

కలం, వెబ్ డెస్క్: తమిళ రాజకీయాల్లో దళపతి విజయ్ ఎంతటి సంచలనం నమోదు చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అనూహ్యంగా ఆయన రాజకీయాల్లో ఘన విజయం నమోదు చేశారు. హేమాహేమీలను మట్టికరిపించి.. అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు చాలా మంది తేలిగ్గా తీసుకున్నారు. ఫలితాలు వచ్చే నాటికి కూడా విజయ్ శక్తిని అతికొద్దిమంది మాత్రమే అంచనా వేయగలిగారు. ప్రధాన ప్రతిపక్ష నేతగానో.. గౌరవప్రదమైన సీట్లు సాధిస్తాడనో భావించారు తప్ప ఈ స్థాయిలో తమిళనాడులోనే టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని ఎవరూ ఊహించలేకపోయారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా విజయ్ పేరు మారుమోగిపోతున్నది. విజయ్ కులం ఏమిటి? ఆయన తండ్రి ఎవరు? సామాజిక నేపథ్యం ఏమిటి? ఇటువంటి ప్రశ్నలు అందరి మదిలో మెదులుతున్నాయి. నెటిజన్లు గూగుల్‌లో ఏఐ టూల్స్‌లో ఇదే విషయంపై సెర్చ్ చేస్తున్నారట.

విజయ్ నేపథ్యం ఇది..

 విజయ్ పూర్వీకులు తమిళనాడు రామేశ్వర తీర ప్రాంతానికి చెందినవారని సమాచారం. విజయ్ తండ్రి ప్రముఖ సినీ నిర్మాత, దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్. ఆయన క్రైస్తవ మతం (రోమన్ క్యాథలిక్) ఆచరించారని సమాచారం. తల్లి శోభ తమిళ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు. విజయ్ తన తండ్రి మతమైన క్రైస్తవాన్ని ఆచరిస్తున్నప్పటికీ.. రాజకీయాల్లో కుల-మతాలకు దూరంగా ఉంటున్నట్టు సమాచారం. కుల వివక్ష కరెక్ట్ కాదని.. కులం పేరుతో ఇతరులను తక్కువ చేసి చూడటం అమానుషమని విజయ్ తరుచూ చెబుతుంటారు. అయితే ఇప్పుడు నెట్టింట విజయ్ కులం గురించి నెటిజన్లు వెతుకుతుండటం గమనార్హం.

విజయ్‌కి అన్ని వర్గాల మద్దతు

తమిళ ప్రజలు కులమత భావోద్వేగాలకు భిన్నంగా విజయ్‌కి పట్టం కట్టారు. విజయ్ కూడా పెరియార్ రామస్వామి, అంబేద్కర్ వంటి నేతల ఫొటోలు పెట్టుకొని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తమిళ ప్రజల ఆత్మగౌరవం కాపాడతానని.. కుటుంబపార్టీలను, వారసత్వ రాజకీయాలను దూరం పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు. జెన్ జీ యువత విజయ్‌కు గట్టిగా మద్దతు ఇచ్చినట్టు తెలుస్తోంది. మహిళలు కూడా గణనీయంగా విజయ్‌కు అండగా నిలబడ్డట్టు విశ్లేషణలు సాగుతున్నాయి. ఒక కొత్త నేత రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తే అతడి పనితీరు ఆధారంగా అంచనా వేయకుండా కులాల కోసం వెతకడం ఏమిటన్న చర్చ సాగుతోంది.

Read Also: 7న విజయ్ ప్రమాణ స్వీకారం? రేపు గవర్నర్‌తో భేటీ

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>