విజయ్ విజయకేతనం.. ఏపీలో వైసీపీ సంబరాలు

కలం, వెబ్ డెస్క్ : తమిళనాడు రాజకీయాల్లో దళపతి విజయ్ (Vijay) సృష్టించిన ప్రభంజనం పట్ల ఏపీలోని వైసీపీ శ్రేణులు సంబరాలు (YSRCP Celebrations) చేసుకుంటున్నారు. తమ అధినేత జగన్ తో విజయ్ కి మంచి సాన్నిహిత్యం ఉందని.. ఇది రాబోయే కాలంలో ఏపీలో కూడా పెను మార్పులకు నాంది కాబోతుందని వైసీపీ శ్రేణులు అంటున్నారు. ఈ క్రమంలో తమిళనాడులో విజయ్ విజయం సాధించడం పట్ల గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు.

ఈ సందర్భంగా నారాయణ స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయ్, జగన్ మధ్య మంచి స్నేహబంధం ఉందని, వారిద్దరి ఆలోచనా విధానం ఒకేలా ఉంటుందని వెల్లడించారు. ఓడినా.. గెలిచినా సింహం సింగిల్ గానే వస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో విజయ్ దళపతి, ఏపీలో వైఎస్ జగన్ ఇద్దరూ ఒంటరి పోరాటానికి నిదర్శమని వ్యాఖ్యానించారు. తమిళనాడు ప్రజలకు ముఖ్యమంత్రి విజయ్ దళపతి సుపరిపాలన అందిస్తారని నమ్మకం ఉందని అభిప్రాయపడ్డారు.

తమిళనాడు ఎన్నికల్లో విజయ్ టీవీకే పార్టీ విజయకేతనం ఎగరవేయడంపై వైసీపీ శ్రేణులు సంబరాలు (YSRCP Celebrations) చేసుకోవడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. విజయ్ విజయంతో ఏపీలోని సరిహద్దు ప్రాంతాలు ప్రభావితం కానున్నాయి. గంగాధర నెల్లూరు నియోజకవర్గం తమిళనాడు సరిహద్దులో ఉండటంతో అక్కడి ప్రజలపై ఈ ప్రభావం కనిపిస్తోంది. ఈ క్రమంలోనే సరిహద్దు ప్రాంతాల్లో వైసీపీ శ్రేణులు విజయ్ విజయంపై పెద్ద ఎత్తున  సంబరాలు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read Also: బ్రెజిల్‌లో కుప్పకూలిన విమానం.. 68 మంది మృతి!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>