epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ప‌శ్చిమ‌బెంగాల్ గ‌వ‌ర్న‌ర్‌కు హ‌త్యా బెదిరింపులు!

క‌లం వెబ్ డెస్క్‌ : పశ్చిమ బెంగాల్(West Bengal) గవర్నర్ సీవీ ఆనంద బోస్‌(CV Ananda Bose)కు గురువారం రాత్రి హ‌త్యా బెదిరింపులు(Death Threat) రావ‌డం క‌ల‌క‌లం రేపింది. గ‌వ‌ర్న‌ర్‌ను బాంబుల‌తో పేల్చేస్తామ‌ని ఓ ఆగంత‌కుడు ఈమెయిల్(email) పంపించాడు. దీంతో పోలీసులు ఆయన భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఈ బెదిరింపుల‌కు సంబందించి ఓ రాజ్ భవన్(Raj Bhavan) అధికారి కీల‌క వివ‌రాలు తెలిపారు. ఈమెయిల్‌లో గవర్నర్‌ను “పేల్చేస్తాం” అంటూ బెదిరించార‌ని, బెదిరింపు ఈమెయిల్ పంపిన వ్యక్తి తన మొబైల్ నంబర్‌ను కూడా అందులో పేర్కొన్నాడ‌ని చెప్పారు. దీంతో వెంటనే ఆ వ్యక్తిని అరెస్టు చేయాలని డీజీపీకి సమాచారం ఇచ్చామ‌ని చెప్పారు. సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee)కి, కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు కూడా విష‌యాన్ని తెలిపారు. రాష్ట్ర పోలీసుల‌తో పాటు సీఆర్‌పీఎఫ్ సిబ్బందితో గవర్నర్‌కు భద్రత పెంచారు. గ‌వ‌ర్న‌ర్‌కు జెడ్ ప్లస్ భద్రతతో 60 నుంచి 70 మంది కేంద్ర బలగాల సిబ్బంది రక్షణగా ఉన్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>