మమతా నివాసం వద్ద ఉద్రిక్తత: జై శ్రీరామ్ నినాదాలు..!

కలం, వెబ్ డెస్క్​ : పశ్చిమ బెంగాల్ (West Bengal) రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో భారతీయ జనతా పార్టీ (BJP) స్పష్టమైన ఆధిక్యత దిశగా దూసుకుపోతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారింది. ముఖ్యంగా మమతా బెనర్జీ నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో ఆమె ఇంటి పరిసరాలకు చేరుకుని, విజయ సంకేతంగా ‘జై శ్రీరామ్’ అంటూ నినాదాలు చేస్తున్నారు.

ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాల సరళిని పరిశీలిస్తే, బెంగాల్ (West Bengal) లోని మొత్తం 293 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ ఏకంగా 193 చోట్ల ముందంజలో ఉంది. కమలం పార్టీ మ్యాజిక్ ఫిగర్‌ను దాటి భారీ మెజారిటీ దిశగా పయనిస్తుండటంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొన్నది. ఈ క్రమంలోనే మమత ఇంటి వద్ద నినాదాల హోరు పెరగడం, ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడకుండా పోలీసులు భారీగా మోహరించారు. బెంగాల్ రాజకీయ ముఖచిత్రం మారబోతోందన్న సంకేతాల మధ్య కలకత్తా వీధులన్నీ ఇప్పుడు కాషాయ దళాల నినాదాలతో మారుమోగిపోతున్నాయి.

Read Also: స్టాలిన్ ఓటమి.. సీఎం పదవికి రాజీనామా!

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>