కలం, సినిమా : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో టీవీకే పార్టీ భారీ ఆధిక్యంతో దూసుకుపోతుంది. ఈ సందర్భంగా న్యాచురల్ స్టార్ నాని (Nani) తన సోషల్ మీడియా వేదికగా టీవీకే అధినేత విజయ్ (TVK Chief Vijay) కు అభినందనలు తెలిపారు. ‘మొదట అనుమానం, తర్వాత పట్టాభిషేకం జరిగింది. ఇది మా ఇంట్లో జరిగింది, ఇప్పుడు మన పొరుగు ఇంట్లో కూడా జరుగుతోంది’ అని ఆయన (Nani) పేర్కొన్నారు. అండర్‌డాగ్ విజయం ఎప్పుడూ ‘అబ్సల్యూట్ సినిమా’ లాంటిది, లేదా ‘అబ్సల్యూట్ పాలిటిక్స్’ అని చెప్పాలా అన్నట్లుగా సరదాగా వ్యాఖ్యానించారు. తమిళనాడు ప్రజలు తమ నిర్ణయాన్ని స్పష్టంగా వెల్లడించారని, వారి కోసం మంచి మార్పులు జరుగాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Read Also: టీవీకే పార్టీకి మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు
Follow Us On: X(Twitter)

