స్టాలిన్ ఓటమి.. సీఎం పదవికి రాజీనామా!

కలం, వెబ్ డెస్క్: తమిళనాడు ఎన్నికల్లో సంచలనాలు నమోదు అవుతున్నాయి. డీఎంకే అధినేత, సీఎం స్టాలిన్ (Stalin) స్వయంగా తాను పోటీ చేసిన కొలత్తూర్‌లో టీవీకే అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. అధికారం పోయి ఇప్పటికే షాక్‌లో ఉన్న డీఎంకే నేతలు, కార్యకర్తలకు స్వయంగా తమ అధినేతనే ఓడిపోవడం ఏమాత్రం మింగుడు పడటం లేదు. స్టార్ హీరో విజయ్ టీవీకే పార్టీకి కనీవినీ ఎరుగని రీతిలో ఓటర్లు పట్టం కట్టారు. తమిళనాడు ఎన్నికల ఫలితాలు దేశ ప్రజలను ఆశ్చర్యంలో ముంచెత్తాయి.

మరికాసేపట్లో గవర్నర్ వద్దకు..

డీఎంకే ఓటమి పాలైన నేపథ్యంలో సీఎం పదవికి రాజీనామా చేయాలని స్టాలిన్ (Stalin) నిర్ణయించుకున్నారు. ఈ మేరకు మరికాసేపట్లో గవర్నర్‌ను కలిసి రాజీనామా పత్రం సమర్పించనున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని గవర్నర్ కోరే అవకాశం ఉంది.

Read Also: త్రిషకు విజయ్ బర్త్‌డే గిఫ్ట్.. ఏకంగా డిప్యూటీ సీఎం‌!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>