Mobile Popup Ad
Mobile Popup Ad

యుద్ధం ఎఫెక్ట్.. వాయిదా పడ్డ స్టార్ హీరో సినిమా

కలం, వెబ్ డెస్క్ : పశ్చిమాసియా యుద్ధం (West Asia War) ఎఫెక్ట్ అన్ని రంగాలపై పడుతోంది. ఇప్పటికే ఇండియాలో గ్యాస్ కొరత తీవ్ర స్థాయిలో ఉంది. ఇంకోవైపు క్రూడ్ ఆయిల్, స్టాక్ మార్కెట్లు, ఇతర రంగాల ఎగుమతులు, దిగుమతులపై పడుతోంది. అయితే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీపై కూడా పడింది ఈ యుద్ధం ఎఫెక్ట్. తాజాగా మలయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ (Mohanlal) నటించిన సంచలన మూవీ దృశ్యం-3 (Drishyam 3) వాయిదా పడింది. దృశ్యం సిరీస్ కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాక్కర్లేదు.

జీతూ జోసెఫ్ డైరెక్ట్ చేసిన ఈ మూడో పార్టును ఏప్రిల్ 2న రిలీజ్ చేసేందుకు డేట్ కూడా ఫిక్స్ చేశారు. ఇప్పటికే ప్రమోషన్లు కూడా చేశారు. కానీ యుద్దం ఆగకపోవడంతో దృశ్యం-3 (Drishyam 3) మూవీని నిరవధికంగా వాయిదా వేశారు. ఎందుకంటే మలయాళ సినిమాలకు గల్ఫ్ దేశాలు పెద్ద మార్కెట్. పైగా మోహన్ లాల్ సినిమాకు అక్కడ మంచి మార్కెట్ ఉంది. యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాల్లో రిలీజ్ చేయడానికి వీలు లేదు. కాబట్టి మూవీ బడ్జెట్, వసూళ్లను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను వాయిదా వేసింది మూవీ టీమ్. త్వరలోనే రిలీజ్ డేట్ ను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Read Also: ఉద్యోగి జీతంలో ‘ప్రణామ్’ కట్టింగ్ ఎంత? ప్రభుత్వ పరిశీలనలో 10%-15%!

Follow Us On: Instagram

 

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>