Mobile Popup Ad
Mobile Popup Ad

ఆ డబ్బు ఎక్కడిది? మొయినాబాద్ డ్రగ్స్ కేసులో సిట్ ఆరా

కలం, వెబ్ డెస్క్: మొయినాబాద్ డ్రగ్స్ కేసు(Moinabad Drugs Case)కు సంబంధించి సిట్ విచారణ కొనసాగుతుంది. ఈ కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అరెస్టయిన విషయం తెలిసిందే.  ప్రస్తుతం ఇతర అనుమానితులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. డ్రగ్స్ ఎక్కడ కొనుగోలు చేశారు? గతంలో ఇటువంటి పార్టీలు జరిగాయా? డ్రగ్స్ సప్లై చేసింది ఎవరు? ఇంకా ఎవరెవరు పార్టీలో పాల్గొన్నారు? తదితర అంశాలపై విచారణ కొనసాగుతున్నట్టు సమాచారం. ఈ కేసులో ఆదివారం కౌశిక్ రవి, శ్రవణ్, అర్జున్, ప్రియాంకా రెడ్డిని పోలీసులు ప్రశ్నించారు. ప్రియాంకా రెడ్డి అనే యువతి కూడా ఆ పార్టీలో పాల్గొన్నారు. పోలీసుల ఆమె బ్యాగ్‌లో రూ. లక్ష గుర్తించారు. అయితే ఆ డబ్బు ఎక్కడిది? ఎందుకు తీసుకొచ్చారు? డ్రగ్స్ కొనుగోలు చేసేందుకే తీసుకొచ్చారా? అన్న కోణంలో పోలీసులు ప్రశ్నించినట్టు సమాచారం.

ఇప్పటికే వీరికి 41 ఏ కింద నోటీసులు ఇచ్చిన సిట్ అధికారులు ఎంక్వైరీ కొనసాగిస్తున్నారు. ఈ నలుగురికి సంబంధించి కాల్ హిస్టరీ, వాట్సాప్ చాట్ కూడా పరిశీలిస్తున్నట్టు సమాచారం. గోవా నుంచి డ్రగ్స్ హైదరాబాద్‌కు తీసుకొచ్చినట్టు సిట్ అనుమానిస్తోంది.

Read Also: ఉద్యోగి జీతంలో ‘ప్రణామ్’ కట్టింగ్ ఎంత? ప్రభుత్వ పరిశీలనలో 10%-15%!

Follow Us On : WhatsApp

 

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>