ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌.. BCCI సంచలన నిర్ణయం!

కలం, వెబ్ డెస్క్ : సూర్య కుమార్ సారథ్యంలోని టీమిండియా టీ 20 వరల్డ్ కప్ 2026ను సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఐపీఎల్ తర్వాత టీమిండియా అఫ్గానిస్థాన్, ఐర్లాండ్ తో టీ20 సిరీస్ ఆడనుంది. అయితే ఐర్లాండ్ తో టీ20 సిరీస్ కు సూర్య కుమార్ యాదవ్ కు బదులు యువ స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్‌ (Shubman Gill )కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని బీసీసీఐ (BCCI) నిర్ణయం తీసుకుందనే టాక్ వినిపిస్తోంది. కాగా, గిల్ ఇప్పటికే టెస్టు, వన్డే ఫార్మాట్లకు కెప్టెన్సీ బాధ్యలు నిర్వహిస్తున్నాడు.

రాబోయే టీ20 ప్రపంచ కప్‌లో పాటు 2028 ఒలింపిక్స్‌ను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ టీమిండియా క్రికెట్‌లో కీలక మార్పులకు నాంది పలుకుతున్నట్లు తెలుస్తోంది.ఇందులో భాగంగానే భారత్-ఐర్లాండ్ మధ్య జూన్‌లో జరగనున్న రెండు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు గిల్ ను కెప్టెన్ గా తీసుకోవాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుందని బీసీసీఐ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఇప్పటికే గిల్ (Shubman Gill) సారథ్యంలో  వన్డే, టెస్ట్ ఫార్మాట్లో మంచి ఫలితాలు వస్తున్న వేళ టీ20 సిరీస్ బాధ్యతలను గిల్ కే అప్పగించి అతనిని సారథిగా తీర్చిదిద్దాలని బీసీసీఐ భావిస్తోందట. మరి ఈ నిర్ణయం భారత క్రికెట్ భవిష్యత్ పై ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశం ఆసక్తికరంగా మారింది.

Read Also: ఆర్ఆర్‌ను అడ్డుకోవడం ఎవరి వల్లా కాదు: అశ్విన్

Follow Us On: Instagram

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>