జూబ్లీహిల్స్(Jubilee Hills) ఉపఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. యూసఫ్ గుడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో 42 టేబుల్స్‌పై కౌంటింగ్ జరుగుతోంది. మొత్తం 10 రౌండ్లలో జరిగే కౌంటింగ్‌ను 186 మంది సిబ్బంది నిర్వహించనున్నారు. ఒక్కో రౌండ్ కనీసం 40 నిమిషాలు ఉంటుందని, ఈ లెక్కన ధ్యాహ్నం 2 గంటల కల్లా తుది నిర్ణయం వెలువడచ్చని ఎన్నికల అధికారి కర్ణన్ అంచనా వేశారు. ఈ కౌంటింగ్ నేపథ్యంలోనే నియోజకవర్గం అంతటా సెక్షన్ 144ను అమలు చేశారు పోలీసులు. స్ట్రాంగ్ రూమ్ నుంచి ఈవీఎంలు, బ్యాలెట్ బాక్స్‌లను కౌంటింగ్ కేంద్రానికి అధికారులు తరలిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక బరిలో మొత్తం 58 మంది అభ్యర్థులు ఉన్నారు. మొత్తం 150 మంది వరకు నామినేషన్లు వేయగా.. ఆఖరికి 58 మంది అభ్యర్థులు మిగిలారు.
ఈ జూబ్లీహిల్స్(Jubilee Hills) ఉపఎన్నికలో 59 మంది అభ్యర్థులు (నోటాతో కలిపి) పోటీలో ఉన్నందున, 42 కౌంటింగ్ టేబుళ్ల ఏర్పాటు కోసం ఈసీఐ ప్రత్యేక అనుమతి ఇచ్చిందని సీఈఓ సుదర్శన్ రెడ్డి వివరించారు. మొత్తం ప్రక్రియ గరిష్టంగా 10 రౌండ్లలో పూర్తయ్యే అవకాశం ఉందన్నారు. లెక్కింపు పనులను ఈసీఐ సాధారణ పరిశీలకులు పర్యవేక్షించనున్నారని, మొత్తం 186 మంది సిబ్బందిని—సూపర్వైజర్లు, అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లు—నియమించామని చెప్పారు. అప్‌డేట్స్‌ను ఎల్ఈడీ స్క్రీన్లు మరియు ఈసీ యాప్ ద్వారా అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. కౌంటింగ్ సెంటర్‌లోకి అభ్యర్థులు, వారి ఎన్నికల ప్రతినిధులు, అనుమతిచ్చిన కౌంటింగ్ ఏజెంట్లకు మాత్రమే ప్రవేశం ఉంటుందని స్పష్టం చేశారు. ఇతరులెవరికీ అనుమతి ఉండదని చెప్పారు. కౌంటింగ్ రోజున భద్రతకు పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాటు చేసినట్టు, కౌంటింగ్ సెంటర్ పరిసరాల్లో సెక్షన్ 144 అమల్లో ఉంటుందని, ఉల్లంఘనలపై చర్యలు తప్పవని సీఈఓ హెచ్చరించారు.
Read Also: పది మందిలో మాట్లాడలేకపోతున్నారా..? ఇదే కారణం కావొచ్చు..!
Follow Us on: Instagram

