కలం, కరీంనగర్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) బస్సుల్లో ప్రయాణికులకు అందించే ‘జీవా’ నీళ్ల బాటిళ్ల సరఫరా నిలిచిపోయింది. గత 10 రోజులుగా వాటర్ బాటిళ్లు (Water Bottles) అందించకుండా ఆర్టీసీ దోపిడీ చేస్తోందంటూ ప్రయాణికులు మండిపడుతున్నారు. సూపర్ లగ్జరీ, ఇ-సూపర్ లగ్జరీ, రాజధాని, లహరి, గరుడ ప్లస్ బస్సుల్లో టికెట్ ధరతో పాటు బాటిల్ కోసం రూ.10 వసూలు చేస్తున్నా ఇవ్వడం లేదు. కాగా బాటిల్ సరఫరా లేకపోయినా, సాఫ్ట్ వేర్ లో మార్పులు చేయకపోవడంతో ప్రయాణికుల నుంచి ఆ డబ్బులు వసూలు అవుతూనే ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతున్న వేళ బస్సుల్లో నీరు అందకపోవడంతో వృద్ధులు, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. గత వారం పది రోజులుగా సరఫరా లేక దాదాపు రూ. 70 లక్షలపైనే ఆర్టీసీ ప్రయాణికుల నుంచి దోపిడీ జరిగిందని స్పష్టమవుతోంది.
ఎండలు ముదురుతున్న సమయంలో ఆర్టీసీ ప్రయాణికులకు శాపంగా మారింది. సూపర్ లగ్జరీ, ఇ-సూపర్ లగ్జరీ, రాజధాని, లహరి, గరుడ ప్లస్ బస్సుల్లో టికెట్ ధరతో పాటు బాటిల్ (500 మి.లీ) కోసం రూ.10 వసూలు చేస్తున్నా సరఫరా నిలిచిపోయింది. సాఫ్ట్ వేర్ లో మార్పులు చేయకపోవడంతో ప్రయాణికుల నుంచి ఆ డబ్బులు వసూలు అవుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతున్న వేళ బస్సుల్లో నీరు అందకపోవడంతో వృద్ధులు, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతున్న వేళ బస్సుల్లో నీరు అందకపోవడంతో వృద్ధులు, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయం ప్రయాణికులకు శాపంగా మారింది. ప్రధానంగా ఏసి, సూపర్ లగ్జరీ, ఎలక్ట్రిక్ ఏసి బస్సుల్లో ఈ ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. కొన్ని బస్టాండ్లలో మంచినీటి సదుపాయం సైతం సరిగ్గా లేకపోగా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. దుకాణాల్లో ఆయా కంపెనీలకు బదులు నాన్ బ్రాండ్ ల పేరుతో డబ్బులు దోచుకుంటున్నారు. విచిత్రమేమిటంటే పశ్చిమాసియాలో ఇరాన్ ఇజ్రాయెల్ యుద్దం కారణంగా బాటిళ్లకు సరిపడా ముడిసరుకు కొరతగా అధికారులు చెబుతుండడం గమనార్హం. నీళ్ల బాటిల్ ఇస్తారనుకుని ఆర్టీసీ బస్సెక్కిన ప్రయాణికులు దాహార్తితో అలమటిస్తున్నారు.
ప్రయాణికుల నుంచి దోపిడీ…
మూడేళ్లుగా సూపర్ లగ్జరీ, ఈ సూపర్ లగ్జరీ, లహరి, రాజధాని, గరుడ ప్లస్ ఏసి, నాన్ ఏసి సర్వీసుల్లో ప్రయాణికులకు ‘జీవ’ పేరిట అర లీటర్ నీళ్ల బాటిళ్లను ఆర్టీసీ అందజేస్తోంది. వేసవిలో ఎండలు మండిపోతున్న సమయంలో వాటి పంపిణీని నిలిపివేయడంతో ప్రయాణికులు డ్రైవర్లతో గొడవకు దిగుతున్నారు. పైగా ఇదేమీ ఉచితంగా ఇచ్చేవి కాదంటూ టికెట్ చార్జీలోనే కలిపి రూ.10 వరకు వసూలు చేస్తున్నారు. రాష్ట్రంలో 11 ఆర్టీసీ (TGSRTC) రీజియన్లున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 97 ఆర్టీసీ డిపోలున్నాయి. కరీంనగర్ రీజియన్లోనే 11 డిపోల నుంచి రోజువారీగా 5 లక్షల మంది ప్రయాణిస్తుంటారు. అందులో పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్ లలో 70 శాతం మహిళలు, పురుషులు ప్రయాణిస్తుంటారు. రాష్ట్రంలోని 97 ఆర్టీసి డిపోల పరిధిలోని 967 బస్సుల్లో ఒక్కో ట్రిప్పుకు 34812 నీటి సీసాలను అందించాలి. ఈ లెక్కన రోజుకు సగటున రెండు ట్రిప్పులకు సంబంధించి మొత్తం 69, 624 తాగునీటి సీసాలు అవసరం. ప్రయాణికుల నుంచి వీటి కోసం దాదాపు రూ. 6.96 లక్షలు వసూలు చేస్తున్నారు. మూడు ట్రిప్పులు ప్రయాణించే బస్సుల్లో మరింత వసూళ్లు పెరుగుతాయి. హైదరాబాదు, సికింద్రాబాద్ పరిధిలోనే ఎక్కువ బస్సులున్నాయి. ఈ లెక్కన గత వారం పదిరోజులుగా రూ. 80 లక్షలకు పైగా ప్రయాణికుల నుంచి దోపిడీ జరిగిందని తెలుస్తోంది.
దూర ప్రయాణాలలోనే…
మహాలక్ష్మి పథకంలో బాగంగా ఉచిత బస్సు ప్రయాణంలో సీట్లు దొరకకపోవడం, దూర ప్రయాణం కారణంగా మద్యతరగతి ప్రజలు సైతం ఏసి, లగ్జరీ బస్సుల్లో ప్రయాణాలు చేయాల్సి వస్తోందని అంటున్నారు. ప్రయాణ ఖర్చులు భారమైనప్పటికీ అదనపు భారం వేయడం సరికాదంటున్నారు. జీవ వాటర్ బాటిల్స్ హైదరాబాద్ నుంచి కరీంనగర్ వర్క్ షాప్ వరకు, అక్కడి నుంచి వివిధ డిపోలకు సరఫరా చేస్తారు. ఆయా డిపోల నుంచి సూపర్ లగ్జరీ, డీలక్స్, రాజధాని, లహరి బస్సుల సిబ్బంది వాటిని ప్రయాణికుల టికెట్ తీసుకున్నాక అందించే వారు. కానీ గత పది రోజులుగా జీవ వాటర్ బాటిళ్లు ఇవ్వకుండా టికెట్ ధరలో వాటర్ బాటిల్ కు ఎలా చార్జి చేస్తారని ప్రయాణికులు మండి పడుతున్నారు.
ఒక్క కరీంనగర్ డిపో పరిధిలోనే రోజుకు రూ. 90 వేలకు పైగా దోపిడీ జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. సరఫరాలో జాప్యంతో పరిస్థితి నెలకొందని, ఆర్టీసీ (TGSRTC) అధికారులు చెబుతున్నారు. ఛార్జీలు వసూలు చేస్తున్నా పంపిణీ చేయకపోవడమేంటని డ్రైవర్లు, కండక్టర్లు, డిపో మేనేజర్లను ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు గతంలో ఏసీ బస్సుల్లో మాత్రమే ఇచ్చే ఈ సదుపాయాన్ని ప్రయాణికుల కోసం నిరంతరం కొనసాగించాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.
Read Also: పార్టీ లాంచింగ్ డేట్ ప్రకటించిన కవిత
Follow Us On : WhatsApp

