కలం, వెబ్ డెస్క్ : మెగా పవర్ స్టార్ రాంచరణ్ (Ram Charan), టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సన(Buchi Babu Sana) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ “పెద్ది”(Peddi). ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. వృద్ది సినిమాస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ బిగ్గెస్ట్ మూవీ ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన సాంగ్స్ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి.
తాజాగా నేడు (మార్చి 27) రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ అదిరిపోయే గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్‌లో రామ్ చరణ్ కుస్తీ చేస్తున్న పహిల్వాన్‌గా కనిపించారు. అయితే చరణ్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చూసి ఫ్యాన్స్ షాక్ అయ్యారు. బుచ్చి బాబు నుంచి ఇది అస్సలు ఊహించలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ‘పెద్ది పహిల్వాన్’ (Peddi Pehelwan) గ్లింప్స్ చూసి మెచ్చుకున్నారంటూ పెద్ది టీం ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేసింది. ఏప్రిల్ 30న రామ్ చరణ్ నట విశ్వరూపం చూస్తారని పెద్ది టీం పేర్కొనింది.
Read Also: ప్రేమ, పెళ్లిపై తేల్చేసిన సాయిపల్లవి..
Follow Us On: X(Twitter)

