పంత్‌కు కెప్టెన్సీ వద్దు.. జాఫర్ షాకింగ్ కామెంట్స్!

క‌లం, వెబ్‌డెస్క్‌: రిషభ్ పంత్ (Rishabh Pant) మళ్లీ ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి వచ్చాడు. ఇప్పుడు అతడికి కెప్టెన్సీ ఇస్తారా అనే చర్చ మొదలైంది. అయితే మాజీ భారత ఓపెనర్ వసీం జాఫర్ (Wasim Jaffer) మాత్రం పంత్ కెప్టెన్సీకి దూరంగా ఉండాలని సూచించారు. 2026 ఐపీఎల్ సీజన్ తర్వాత పంత్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు తిరిగొచ్చాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన ట్రేడ్‌లో అతడు ఢిల్లీకి మారాడు. ఈ డీల్‌లో పంత్ విలువ రూ.15 కోట్లుగా ఉంది. కుల్దీప్ యాదవ్ లక్నోకు వెళ్లాడు. లక్నోకు పంత్ రెండు సీజన్లు కెప్టెన్‌గా వ్యవహరించాడు. కానీ జట్టు ఆశించిన ఫలితాలు సాధించలేదు.

2025లో ఏడో స్థానంలో నిలిచింది. 2026లో చివరి స్థానానికి పడిపోయింది. ఈ పరిస్థితుల్లో పంత్ ముందుగా తన ఫామ్‌పై దృష్టి పెట్టాలని జాఫర్ అభిప్రాయపడ్డారు. ఢిల్లీ కెప్టెన్సీ ఆఫర్ చేసినా దానిని తిరస్కరించడం మంచిదని సూచించారు. పంత్ ప్రస్తుతం బ్యాటర్‌గా బలంగా తిరిగి రావడం ముఖ్యమని జాఫర్ చెప్పారు. ఐపీఎల్‌లో మంచి ప్రదర్శన చేసి భారత టీ20, వన్డే జట్లలో తిరిగి స్థానం సంపాదించడమే అతడి ప్రాధాన్యంగా ఉండాలని తెలిపారు. కెప్టెన్సీతో అదనపు ఒత్తిడి వస్తుందని జాఫర్ వివరించారు.

ఫ్రాంచైజీ యాజమాన్యం, అభిమానుల అంచనాలు ఉంటాయని చెప్పారు. పంత్ ఇప్పటికే వికెట్ కీపర్‌గా, బ్యాటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడని గుర్తు చేశారు. ఢిల్లీ కెప్టెన్సీలో మార్పు వస్తే కేఎల్ రాహుల్ మంచి ప్రత్యామ్నాయంగా ఉంటాడని జాఫర్ అభిప్రాయపడ్డారు. 2026 ఐపీఎల్‌లో ఢిల్లీ ఏడు విజయాలతో ఆరో స్థానంలో నిలిచింది. వరుసగా ఐదోసారి ప్లేఆఫ్స్‌కు దూరమైంది. కొత్త కోచ్ సౌరవ్ గంగూలీ నేతృత్వంలో ఢిల్లీ ఇప్పుడు కెప్టెన్సీపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>