కలం, సినిమా : టాలీవుడ్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ కమ్ సింగర్ రమణ గోగుల (Ramana Gogula) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మ్యూజిక్ డైరెక్టర్ గా అద్భుతమైన పాటలు అందించిన రమణ గోగుల డిఫరెంట్ వాయిస్ తో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడారు. అయితే కొంత గ్యాప్ తర్వాత విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరక్కెక్కిన ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ “సంక్రాంతికి వస్తున్నాం” సినిమాలో గోదారి గట్టు పైన అనే పాటతో మరోసారి రమణ గోగుల సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఎక్కడ చూసిన ఆ పాట ఫుల్ ట్రెండ్ అయిపోయింది. ఆ పాట ఎంత పాపులర్ అయిందో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా కూడా అదే రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా అంతగా హిట్ అవ్వడానికి రమణ గోగుల సాంగ్ ఎంతగానో ఉపయోగపడిందనే విషయం బాగా తెలిసిన అనిల్ రావిపూడి తాను లేటెస్ట్ గా తెరకెక్కిస్తున్న చిరంజీవి “ మన శంకర్ వరప్రసాద్ గారు” (Mana Shankara Vara Prasad Garu) సినిమాలో కూడా రమణ గోగులతో ఓ పాట పాడించారట.
అసలు ఈ మూవీ మ్యూజిక్ సిట్టింగ్స్ లో ఫస్ట్ రికార్డ్ చేయించింది కూడా రమణ గోగుల (Ramana Gogula) పాటే అని తెలుస్తుంది. ఇప్పటి వరకు “మన శంకర్ వరప్రసాద్ గారు” మూవీ నుంచి మూడు పాటలు రిలీజ్ చేశారు. ఈ మూడు పాటల్లో మీసాల పిల్ల సాంగ్ చాట్ బస్టర్ గా నిలిచింది. శశిరేఖ సాంగ్ ఓకే అనిపించగా.. చిరు, వెంకీల పై చిత్రీకరించిన మాస్ సాంగ్ అయితే ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. అయితే ఈ సినిమా కోసం రమణ గోగులతో పాడించిన పాట హైలైట్ గా నిలుస్తుందని చెప్పారు కానీ ఇంత వరకు ఆ సాంగ్ రిలీజ్ చేయలేదు.
భాస్కరభట్ల సాహిత్యం అందించిన ఆ పాటకు భీమ్స్ అదిరిపోయే ట్యూన్ అందించినట్లు సమాచారం. అయితే ఈ పాటను ఇంత వరకు రిలీజ్ చేయకపోవడానికి కారణం ఏమిటంటే.. ఈ పాటకు సినిమాలో సరైన ప్లేస్ మెంట్ దొరక్కపోవడం వలన ఏకంగా సినిమా నుంచే తొలగించినట్లుగా టాక్ వినిపిస్తోంది. ఎక్కడోచోట పెట్టినా మరీ ఇరికించినట్టు అవుతుందనే ఉద్దేశ్యంతో పక్కన పెట్టేసినట్లు ఇన్ సైడ్ వర్గాల సమాచారం.
Read Also: రాంచరణ్ ఫ్యాన్స్ కి షాక్ .. పెద్ది రిలీజ్ వాయిదా
Follow Us On: Youtube


