కలం, సినిమా : గేమ్ ఛేంజర్ ఫ్లాప్ తో డీలా పడ్డ రాంచరణ్ (Ram Charan) ఫ్యాన్స్ “పెద్ది” (Peddi) సినిమాపై భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సన (Buchi Babu Sana) డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ బిగ్గెస్ట్ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో జగపతి బాబు (Jagapathi Babu), శివరాజ్ కుమార్ (Shiva Rajkumar) వంటి స్టార్స్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ ఏ.ఆర్ రెహమాన్ (A.R. Rahman) మ్యూజిక్ అందిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీని మెగా పవర్ స్టార్ రాంచరణ్ బర్త్డే సంధర్భంగా మార్చి 27న రిలీజ్ చేస్తున్నట్లు గతంలో మేకర్స్ ప్రకటించారు.
కానీ తాజాగా రాంచరణ్ (Ram Charan) ఫ్యాన్స్ కు పెద్ది యూనిట్ ఊహించని షాక్ ఇచ్చింది. పెద్ది చిత్రాన్ని డిసెంబర్ నెలకు వాయిదా వేస్తున్నట్లు సమాచారం. సాంకేతిక కారణాల వల్లే పెద్ది సినిమా వాయిదా వేస్తున్నట్లు తెలుస్తుంది. గ్రాఫిక్స్ (VFX) పనులు మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులకు మరికొంత సమయం పడుతుందని చిత్ర బృందం భావిస్తోంది. ఈ న్యూస్ రాంచరణ్ ఫ్యాన్స్ కి కాస్త నిరాశ కలిగించింది. డైరెక్టర్ బుచ్చి బాబు పెద్ది సినిమాను హడావుడిగా రిలీజ్ చేయడం కంటే విజువల్ పరంగా అత్యున్నత ప్రమాణాలతో తీర్చిదిద్దాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పెద్ది నుంచి రిలీజ్ అయిన సాంగ్స్, పోస్టర్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా నిలిచాయి.
Read Also: చిరూ మూవీ నుంచి రమణ గోగుల పాట తీసేశారా..?
Follow Us On : WhatsApp


