epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ఇండియా స్క్వాడ్‌లోకి గిల్, అయ్యర్ కంబ్యాక్

కలం, వెబ్​ డెస్క్ : టీమిండియాలోకి శుభ్‌మన్ గిల్ (Shubman Gill), శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) కంబ్యాక్ ఇచ్చారు. న్యూజిలాండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌లో (India vs New Zealand ODI series) వాళ్లు ఆడనున్నారు. గాయాల నుంచి కోలుకున్న శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా, శ్రేయస్ అయ్యర్ వైస్‌కెప్టెన్‌గా జట్టులోకి తిరిగి వచ్చారు. ఈ వన్డే సిరీస్ జనవరి 11 నుంచి ప్రారంభం కానుంది. దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్ సమయంలో మెడ నొప్పితో బాధపడిన శుభ్‌మన్ గిల్ వన్డేలకు దూరమయ్యారు. ప్రస్తుతం పూర్తిగా కోలుకుని తిరిగి జట్టులోకి వచ్చారు. ఆస్ట్రేలియా పర్యటనలో గాయపడిన శ్రేయస్ అయ్యర్ అక్టోబర్ 2025 తర్వాత మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెడుతున్నారు.

పేసర్ మహమ్మద్ సిరాజ్‌కు (Mohammed Siraj) ఈ సిరీస్‌కు చోటు దక్కింది. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యకు విశ్రాంతి ఇచ్చారు. 2026 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని పాండ్య వర్క్‌లోడ్‌ను బీసీసీఐ నియంత్రిస్తోంది. దక్షిణాఫ్రికాతో ఆడిన జట్టుతో పోలిస్తే ఈసారి మూడు మార్పులు చేశారు. తిలక్ వర్మ, ధ్రువ్ జురెల్, రుతురాజ్ గైక్వాడ్ స్థానాల్లో శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, మహమ్మద్ సిరాజ్‌లను ఎంపిక చేశారు.

న్యూజిలాండ్ సిరీస్‌కు భారత వన్డే జట్టు :

Shubman Gill (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (వికెట్‌కీపర్), శ్రేయస్ అయ్యర్ (వైస్‌కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, రిషభ్ పంత్ (వికెట్‌కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్ (ఫిట్‌నెట్ క్లియరెన్స్‌ను బట్టి ఎంపిక)

Read Also: కోహ్లీని దాటేసిన రుతురాజ్.. మరో రికార్డ్..

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>