కలం, వెబ్ డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఐబొమ్మ రవి (Ibomma Ravi) కేసులో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఇమ్మడి రవిపై సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS) పోలీసులు నిర్వహించిన విచారణ పూర్తయింది. 12 రోజుల పాటు రవిని ప్రశ్నించిన పోలీసులు, అతడి నుంచి మరిన్ని ఆధారాలు సేకరించారు. ఈ విచారణలో కేవలం పైరసీ మాత్రమే కాకుండా, రవి గుర్తింపు దొంగతనానికి (Identity Theft) కూడా పాల్పడినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. ఇమంది రవి తన సొంత వివరాలకు బదులుగా ప్రహ్లాద్ వెల్లేల అనే వ్యక్తి పేరుతో పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి కీలక పత్రాలను పొందినట్లు పోలీసులు గుర్తించారు.
గతంలో పోలీసుల విచారణలో ప్రహ్లాద్ తన రూమ్ మేట్ అని, అతని అనుమతితోనే ఈ పత్రాలు వాడుతున్నానని ఐ బొమ్మ రవి (Ibomma Ravi) తెలిపాడు. దీంతో పోలీసులు బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్‌గా పనిచేస్తున్న ప్రహ్లాద్‌ను హైదరాబాద్‌కు పిలిపించి ప్రశ్నించారు. కస్టడీలో ఉన్న రవి ఎదుటే ప్రహ్లాద్‌ను విచారించారు. ప్రహ్లాద్ మాట్లాడుతూ తన పేరుతో డాక్యుమెంట్లు తీసుకున్న విషయం తెలిసి షాక్ అయ్యానని చెప్పాడు. తనకు రవితో వ్యక్తిగత లేదా ప్రొఫెషనల్ సంబంధాలు లేవని స్పష్టం చేశాడు. దీంతో ప్రహ్లాద్ డాక్యుమెంట్లను రవి అక్రమంగా సేకరించి ఫేక్ ఐడెంటిటీ సృష్టించుకున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
Read Also: దివ్యాంగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్
Follow Us On: Sharechat


