కలం, వరంగల్ బ్యూరో : వరంగల్ (Warangal) జిల్లాలోని వరంగల్-2 డిపోలో ఆదివారం తెల్లవారుజామున పెను ప్రమాదం తప్పింది. డిపోలో నిలిపి ఉంచిన ఒక ఎలక్ట్రిక్ బస్సులో హఠాత్తుగా మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఆదివారం తెల్లవారుజామున అందరూ గాఢనిద్రలో ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. పార్కింగ్ చేసి ఉన్న ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులో ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో.. చూస్తుండగానే మంటలు బస్సు మొత్తానికి వ్యాపించడంతో వాహనం పూర్తిగా కాలిపోయింది.
సమాచారం అందుకున్న అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనపై ఆర్టీసి ఉన్నతాధికారులు దర్యాప్తు ప్రారంభించారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ అగ్నిప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. అయితే వాహనం పూర్తిగా కాలిపోయినప్పటికీ ఎవరికి ఎటువంటి గాయలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Read Also: బరువు తగ్గడానికి కార్డియో వేస్ట్.. బెస్ట్ దారి ఇదే!
Follow Us On: X(Twitter)

