కేకేఆర్‌కు రహానేనే మైనస్.. శ్రీకాంత్ ఘాటు వ్యాఖ్యలు!

క‌లం, వెబ్ డెస్క్‌: ఐపీఎల్ 2026 టోర్నీలో రెండో మ్యాచ్ ముంబై ఇండియన్స్ (Mumbai Indians), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మధ్య జరగనుంది. ఈ నేపత్యంలో కేకేఆర్ కెప్టెన్ అజింకా రహానే (Ajinkya Rahane)పై టీమిండియా మాజీ ఓపెనర్ కృష్ణమాచారి శ్రీకాంత్ (Krishnamachari Srikkanth) ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేకేఆర్‌కు అసలు మైనస్ కెప్టెన్ రహానేనే అన్నారు. అతడే జట్టుకు భారంగా మారే అవకాశం ఉందని అన్నారు. శ్రీకాంత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గత సీజన్‌లో కేకేఆర్ జట్టు ఎనిమిదో స్థానానికి పడిపోవడానికి రహానే వైఫల్యమే ప్రధాన కారణమని శ్రీకాంత్ విశ్లేషించారు. కేవలం కెప్టెన్ అనే ఒకే ఒక్క కారణంతోనే రహానే తుది జట్టులో ఆడుతున్నారని, ఒక ఆటగాడిగా ఆయన జట్టుకు ఎలాంటి అదనపు బలాన్ని ఇవ్వడం లేదని శ్రీకాంత్ అభిప్రాయపడ్డారు.

రహానే ఓపెనర్‌గా రావడం వల్ల ఒక కీలకమైన స్లాట్ వృథా అవుతోందని ఆయన పేర్కొన్నారు. రహానే అటు విరాట్ కోహ్లీలా ఇన్నింగ్స్ నిర్మించలేరని, ఇటు భారీ షాట్లు కొట్టి బౌలర్లను భయపెట్టలేరని ఘాటుగా విమర్శించారు. 2023లో సీఎస్‌కే తరపున ఏదో మెరిశారు తప్ప, గత రెండు సంవత్సరాలుగా ఆయన ప్రదర్శన ఏమాత్రం ఆశాజనకంగా లేదని శ్రీకాంత్ గుర్తుచేశారు. ఒక ఆటగాడిగా రహానే కేకేఆర్ జట్టును ముందుకు నడిపించలేరని, అది ఆ జట్టుకు పెద్ద మైనస్ అని స్పష్టం చేశారు. గత సీజన్‌లో రహానే 13 మ్యాచ్‌ల్లో 390 పరుగులు చేసినప్పటికీ, జట్టును విజయపథంలో నడిపించడంలో విఫలమయ్యారు.

2016 తర్వాత ఆయన ఒక సీజన్‌లో 400 పరుగుల మార్కును కూడా దాటలేకపోయారు. అటు వేలంలో రూ. 25.20 కోట్లతో కామెరాన్ గ్రీన్‌ను కొనుగోలు చేసిన కేకేఆర్, ఇప్పుడు తన సారథి ప్రదర్శనపై వస్తున్న విమర్శలతో ఆందోళనలో పడింది. శ్రీకాంత్ చేసిన ఈ వ్యాఖ్యలు కేకేఆర్ యాజమాన్యాన్ని ఆలోచనలో పడేశాయి. మరి నేడు ముంబైతో జరిగే మ్యాచ్‌లో రహానే (Rahane) తన బ్యాట్‌తో ఈ విమర్శలకు సమాధానం చెబుతారో లేదో చూడాలి.

Read Also: తన సక్సెస్ సీక్రెట్ చెప్పేసిన విరాట్ కోహ్లీ..!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>