కలం, వరంగల్ బ్యూరో : గర్భంలోని శిశువు లింగ నిర్ధారణ(Gender Determination) , లింగ ఎంపిక వంటి చట్టవిరుద్ధ చర్యలను పూర్తిగా అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని వరంగల్ (Warangal) పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ (CP Sunpreet Singh) తెలిపారు. కమిషనరేట్ పరిధిలో ఈ చట్టాలను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. గర్భంలోని శిశువు లింగాన్ని తెలుసుకోవడం, తెలియజేయడం లేదా దాని ఆధారంగా గర్భస్రావం చేయించడం వంటి చర్యలు సమాజానికి తీవ్ర ముప్పుగా మారుతున్నాయని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా ఈ చర్యలు ఆడ శిశువుల సంఖ్య తగ్గడానికి కారణమవుతున్నాయని అన్నారు.
ఈ నేపథ్యంలో వరంగల్ కమిషనరేట్ పరిధిలోని అన్ని అల్ట్రాసౌండ్ స్కానింగ్ కేంద్రాలు తప్పనిసరిగా చట్టబద్ధమైన రిజిస్ట్రేషన్‌తోనే పనిచేయాలని, అన్ని నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. ఎక్కడైనా లింగ నిర్ధారణ (Gender Determination) జరుగుతున్నట్టు గమనించిన పక్షంలో సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్ 100, కంట్రోల్ రూమ్ నంబర్ 8712685257కు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. ఆడపిల్లల సంరక్షణ, లింగ సమానత్వాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని కమిషనర్ పునరుద్ఘాటించారు.
Read Also: సైకిలే వీల్ చైర్ గా మారింది.. ప్రభుత్వాస్పత్రిలో వృద్ధ దంపతుల పాట్లు
Follow Us On : WhatsApp

