కలం, వెబ్ డెస్క్ : భారత దేశంలో నేటికి ప్రభుత్వాస్పత్రుల దుస్థితి మారడం లేదు. పేద ప్రజలకు చికిత్స అందించాల్సిన దవఖానాలు అరకొర వసతులతో అక్కున చేర్చుకోవడం లేదు. ఇలాంటి ఘటనే మధ్యప్రదేశ్ (Madhya Pradesh) లోని ఓ ప్రభుత్వాస్పత్రిలో జరిగింది. కనీస మౌలిక సదుపాయాలు కూడా లేకపోవడంతో ఓ వృద్ధ దంపతులు పడిన అవస్థలకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. ఆస్పత్రిలో స్ట్రెచర్లు, వీల్ చైర్లు అందుబాటులో లేకపోవడంతో రోగిని ఆమె భర్త సైకిల్ పై తరలించారు. దీనిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమర్జెన్సీ టైంలో కూడా ఆస్పత్రి సిబ్బంది ఎలాంటి సహాయం అందించలేదని మండిపడుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నెలకొన్న దీన స్థితిని ఈ వీడియో వేలెత్తి చూపుతోంది. అయితే, ఈ సంఘటనపై ఆస్పత్రి అధికారులు ఎలాంటి ప్రకటన జారీ చేయకపోయినా రోగులకు సకాలంలో వైద్య సహాయం అందించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
Read Also: హర్మూజ్‌కు ఆల్టర్నేట్గా పైప్‌లైన్!
Follow Us On: X(Twitter)

