కలం, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2026 (IPL 2026) లో భాగంగా శనివారం రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. మొదటి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ ఢీ కొట్టుండగా.. రెండో మ్యాచ్ లో గుజరాత్ , రాజస్థాన్ జట్లు తలపడుతున్నాయి. తాజాగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్ లో ఢిల్లీ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముంబై ఇండియన్స్ జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది.
కాగా, ఢిల్లీతో మ్యాచ్ కు ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా దూరం అయ్యాడు. దీంతో ఈ మ్యాచ్ కు హార్దిక్ పాండ్య స్థానంలో సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. అలాగే ముంబై ఇండియన్స్ తుది జట్టులో మూడు మార్పులు చేసింది. దీపక్ , భాష్, శాంట్నర్ లను తుది జట్టులోకి తీసుకుంది. ఇరు జట్లు తమ తొలి మ్యాచ్ లో విజయం సాధించాయి. కోల్‌కతాపై ముంబై ఇండియన్స్ .. లఖ్‌నవూపై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. దీంతో రెండో విజయాన్ని సొంతం చేసుకోవాలని ఇరు జట్లు బరిలోకి దిగుతున్నాయి.
తుది జట్లు:
ముంబై ఇండియన్స్:
రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్(వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), నమన్ ధీర్, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, మిచెల్ సాంట్నర్, కార్బిన్ బాష్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా.
ఢిల్లీ క్యాపిటల్స్:
కె.ఎల్ రాహుల్(వికెట్ కీపర్), పాతుమ్ నిస్సాంక, నితీష్ రాణా, అక్షర్ పటేల్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, విప్రజ్ నిగమ్, లుంగి ఎంగిడి, కులదీప్ యాదవ్, టి నటరాజన్, ముఖేశ్ కుమార్.
Read Also: సైకిలే వీల్ చైర్ గా మారింది.. ప్రభుత్వాస్పత్రిలో వృద్ధ దంపతుల పాట్లు
Follow Us On: Instagram

