విషాదం.. బైక్ పై వెళ్తున్న భార్యాభర్తలు దుర్మరణం

కలం, వరంగల్ బ్యూరో : కారు ఢీకొని బైక్‌పై వెళ్తున్న భార్యభర్తలు మృతి చెందిన విషాదకర ఘటన నర్సంపేట (Narsampet) శివారు నర్సంపేట – మహబూబాబాద్ 365 జాతీయ రహదారి పై చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం పాల్తియతండకు చెందిన బోడ రమేష్, పూలమ్మ భార్యభర్తలు. సోమవారం పని నిమిత్తం ఇద్దరు కలిసి బైక్ పై వస్తుండగా .. వారి బైక్ ను కారు ఢీకొట్టింది.

ఈ ఘటనలో భార్యభర్తలు అక్కడికక్కడే మరణించారు. కారు కూడా నుజ్జునుజ్జు అయింది. కారులోని వ్యక్తులకు తీవ్ర గాయలు అయినట్లు తెలుస్తోంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>