Mobile Popup Ad
Mobile Popup Ad

మరింత పారదర్శకంగా పంచాయతీరాజ్ శాఖ.. పవన్ కల్యాణ్ దిశానిర్దేశం

కలం, వెబ్ డెస్క్: పంచాయతీరాజ్ శాఖను మరింత పారదర్శకంగా తీర్చిదిద్దుదామని అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) దిశానిర్ధేశం చేశారు. ఈ మేరకు పంచాయతీరాజ్, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖల ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించి మాట్లాడారు. స్థానిక సంస్థలు చేసే అభివృద్ధి పనులు మరింత పారదర్శకంగా ప్రజలకు తెలియాలని చెప్పారు. ఇందు కోసం ప్రత్యేకంగా ఒక పబ్లిక్ డాష్ బోర్డును తయారు చేయాలని ఆదేశించారు. దీనిలో రాష్ట్రంలో జరుగుతున్న రోడ్ల నిర్మాణం, సంబంధిత అభివృద్ధి పనులు, అలాగే రోడ్ల పరిస్థితి ఎప్పటికప్పుడు తెలుసుకునే వెసులుబాటు ప్రతి ఒక్కరికి కల్పించాలని అన్నారు.

పంచాయతీరాజ్ శాఖ 2025-26 ఆర్థిక సంవత్సరానికి స్వర్ణ పంచాయతీ పోర్టల్ ద్వారా ఆన్ లైన్ విధానంతో పారదర్శకంగా పన్నులు వసూళ్ల చేసిందని తెలిపారు. పంచాయతీలు ఆదాయ వనరులు మరింత పెంచుకొని ముందుకు సాగాలని సూచించారు. ఇదే రీతిలో సమష్టి కృషిని కొనసాగించి వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ ఆ స్ఫూర్తిని కొనసాగించాలన్నారు. ఘన వ్యర్థాల నిర్వహణలో భాగంగా తీసుకొచ్చిన స్వచ్ఛరథాల విధానం మంచి ఫలితాలను ఇస్తోందని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) చెప్పారు.

స్వచ్ఛందంగా ప్రజలు రథాల వద్దకు వచ్చి పొడి వ్యర్థాలను ఇచ్చి, నిత్యావసరాలను తీసుకెళ్లడం బాగుందని అన్నారు. దీన్ని ప్రతి నియోజకవర్గంలోనూ అమలు చేస్తున్నామని.. ఈ విధానాన్ని మరింత విస్తరించేలా ఆలోచన చేయాలని సూచించారు. దీంతోపాటు గ్రీన్ షాప్ పేరుతో తిరుపతి జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొచ్చిన విధానాన్ని మరింత విస్తరించి, రాష్ట్రమంతటా అమలు చేయాలన్నారు. స్వచ్ఛరథాల ద్వారా ఏప్రిల్ నెలలో 18.86 లక్షల కేజీల చెత్తను సేకరించామని.. ఆ వ్యర్థాల విలువ రూ. 3 కోట్ల వరకు ఉంటుందన్నారు.

రాష్ట్రంలో పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో చేపడుతున్న రోడ్ల నిర్మాణ పనులు నిర్దేశించిన సమయంలోనే నాణ్యతతో పూర్తయ్యేలా చూడాలని అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు. రోడ్ల నిర్మాణం, పనుల పురోగతి ఎప్పటికప్పుడు తెలుసుకునేలా ప్రత్యేకమైన డ్యాష్ బోర్డును ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. రోడ్ల నిర్మాణ పనులను అధికారులు బాధ్యతగా తీసుకోవాలని సూచించారు.

Read Also: రాయలసీమ లిఫ్ట్‌పై ఉద్యమ కార్యాచరణ.. సజ్జల దిశానిర్దేశం

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>