గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో వరంగల్ చిన్నారి

కలం, వరంగల్ బ్యూరో: వరంగల్ (Warangal) కొత్తవాడ ప్రాంతానికి చెందిన దివ్య-జాయ్ తంబిరాజ్ దంపతుల కుమార్తె జోనిసా ఎస్తేర్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (Guinness World Records) చోటు సంపాదించుకుంది. కీబోర్డ్ ప్రతిభ పోటీల్లో పాల్గొని గంట పాటు నిరంతరాయంగా వాయిస్తూ ఎస్తేర్‌ రికార్డ్ సృష్టించింది. ఈ పోటీల్లో వివిధ దేశాల నుంచి 2 వేల మంది వాయిద్య కారులు పాల్గొన్నారు. ఇందులో ప్రతిభ చూపిన 777 మందికి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ చోటు లభించింది. అతి చిన్న వ‌య‌స్సులోనే ఎస్తేర్‌ గిన్సిస్ రికార్డు సాధించ‌డంపై స్థానికులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. ఎస్తేర్ ఇలాగే మ‌రెన్నో విజ‌యాలు సాధించాల‌ని ఆకాంక్షిస్తున్నారు.

Read Also: బీజేపీ, బీఆర్ఎస్ పొత్తుపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>