సోన్‌లో క్రైస్తవుల సందడి.. ఘనంగా సీఎస్ఐ చర్చి వార్షికోత్సవం!

కలం, సోన్: సోన్ (Soan) మండల కేంద్రంలోని సీఎస్‌ఐ చర్చి (CSI Church) లో 80వ ఆవిర్భావ మహోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. రెవరెండ్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పీఏసీఎస్ చైర్మన్ కృష్ణ ప్రసాద్ రెడ్డి, సోన్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మోహినొద్దీన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చర్చి ఆవరణలో మొక్కలు నాటారు. క్రైస్తవ సంఘస్తులు గీతాలాపనలు, ఆరాధన కార్యక్రమాల్లో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. పాస్టర్లు సీఎస్‌ఐ చరిత్రను వివరిస్తూ వాక్యోపదేశం చేశారు. అనంతరం వారిని క్రైస్తవ సంఘస్తులు సన్మానించారు. అనంతరం పంక్తిభోజనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు పాల్ సువర్ణరాజ్, డి. సోలమన్ రాజ్‌, వివిధ గ్రామాల క్రైస్తవ సంఘస్తులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>