కలం, వెబ్ డెస్క్: ఏపీలో ప్రభుత్వం మున్సిపల్ శాఖలో ఉద్యోగుల (Municipal Employees) ప్రమోషన్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలో స్వర్ణ వార్డు ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ విధివిధానాలు జారీ చేసింది. పోస్టుల సర్దుబాటు ద్వారా మున్సిపల్ పరిపాలన శాఖలో కొత్తగా 815 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల కల్పనకు ఆమోదం తెలుపుతున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. వార్డు అమినిస్ట్రేటివ్ సెక్రటరీలకు కొత్తగా క్రియేట్ చేసిన జూనియర్ అసిస్టెంట్ పోస్టుల్లోకి ప్రమోట్ చేయబోతున్నారు.
వార్డు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలను వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలుగా పదోన్నతులు కల్పించబోతున్నారు. 815 వార్డు పారిశుద్ధ్య, పర్యావరణ సెక్రటరీ పోస్టులను గ్రేడ్–1 స్థాయికి అప్ గ్రేడ్ చేశారు. అలాగే, గ్రేడ్–2 పరిధిలో ఉన్న 815 వార్డు ప్లానింగ్, రెగ్యులేషన్ సెక్రటరీలను గ్రేడ్–1 హోదాకు అప్‌గ్రేడ్ చేశారు. ప్రమోషన్లు దక్కిన మేరకు వారికి వేతనాలు, ఇతర అలవెన్సులు కూడా పెరుగుతాయని.. ఈ మేరకు ఆర్థిక శాఖ చర్యలు తీసుకోవాలని ఆదేశాల్లో స్పష్టం చేశారు.

