ఉద్యమకారులకు తగిన న్యాయం: ఎమ్మెల్యే నాయిని

కలం, హనుమకొండ: తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా 1991 నుంచి వివిధ ఉద్యమాల్లో పాల్గొన్న నిజమైన ఉద్యమకారులను గుర్తించి, వారికి తగిన న్యాయం జరిగేలా కృషి చేస్తానని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి (Naini Rajender Reddy) తెలిపారు. హనుమకొండ బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాళోజీ తెలంగాణ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు విద్యాజయ్ కుమార్, వరంగల్ జిల్లా జేఏసీ అధ్యక్షులు గురుమూర్తి ఆధ్వర్యంలో ఉద్యమకారులు ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ.. తెలంగాణ సాధన కోసం దశాబ్దాలుగా వివిధ దశల్లో ఉద్యమాలు చేసిన ఉద్యమకారుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. నిజమైన ఉద్యమకారులను గుర్తించడంతో పాటు ఉద్యమకారుల సమస్యలను సంబంధిత ప్రభుత్వ పెద్దలు, అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగు అకాడమీ ఛైర్మన్ పురపాటి వెంకన్న రావు, ఉద్యమకారులు వంగల సదానందం, మల్లికార్జున, కొంగ్రాయ్య, రవి, మునీందర్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>