Mobile Popup Ad
Mobile Popup Ad

కాంగ్రెస్‌, బీఆర్ఎస్ నేత‌ల‌పై తిర‌గ‌బ‌డ్డ జ‌నం

కలం, వరంగల్ బ్యూరో: మున్సిప‌ల్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాష్ట్ర‌లోని మున్సిపాలిటీలు, కార్పొరేష‌న్ల‌లో ప‌రిస్థితులు ఒక్కో చోట ఒక్కో ర‌కంగా ఉన్నాయి. అభ్య‌ర్థుల‌ ప్ర‌లోభాలు, పార్టీల నాయ‌కుల గొడ‌వ‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలోని వర్ధన్నపేట (Wardhannapet) మున్సిపాలిటీ పరిధిలో ఉన్న‌ డిసి తండాలో నాయ‌కుల‌కు ఓట‌ర్లు చుక్క‌లు చూపించారు. డిసి పోలింగ్ స్టేషన్ పరిధిలో ఓటింగ్ సరళి పరిశీలనకు వెళ్లిన కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS) నాయకులను తండా వాసులు అడ్డుకున్నారు.

కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల పేరిట అధికారంలోకి వచ్చి రెండేళ్ల నుంచి చేసిందేం లేదని, బీఆర్ఎస్ నాయకులు తండాను ఆరో డివిజన్‌లో కలిపారని ఆందోళనకు దిగారు. దీంతో ఇరు పార్టీలకు చెందిన నేతలు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే రమేష్, కాంగ్రెస్ నేత మారనేని రవీందర్ రావు వెనుదిరిగి వెళ్లిపోయారు.

 Read Also: నల్లగొండలో నకిలీ ఓట్ల కలకలం

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>