కలం, నల్లగొండ బ్యూరో: నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ (Nalgonda Corporation) ఎన్నికల్లో నకిలీ ఓట్ల కలకలం చెలరేగింది. ఓ వ్యక్తి 30వ వార్డులో ఆధార్ కార్డును మార్పింగ్ చేసి ఓటు వేసేందుకు ప్రయత్నించారు. అయితే ఆ సమయంలో అక్కడే ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థి జహంగీర్ సదరు ఓటరు నకిలీ అంటూ గుర్తించారు. నిజమైన ఓటరు సౌతాఫ్రికాలో ఉంటారని.. ఈయన అసలు వ్యక్తి కాదని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పోలింగ్ బూత్‌లో గందరగోళం ఏర్పడింది.
ఘటనా స్థలానికి నల్లగొండ డిఎస్పి శివరాం రెడ్డి చేరుకుని నకిలీ ఓటు విషయమై ఆర్వోకు కంప్లైంట్ చేయాలని.. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అధికార పార్టీ బలంతో దొంగ ఓట్లకు శ్రీకారం చుట్టారని బీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి జహంగీర్ బాబా ఆరోపించారు. ఇదిలా ఉంటే.. నల్లగొండ(Nalgonda) జిల్లాలో మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి 49.79 శాతం పోలింగ్ నమోదయింది. సూర్యాపేట(Suryapet Municipality) జిల్లాలో ఒంటిగంటకు 50.68 శాతం పోలింగ్ నమోదయింది.
Read Also: మూసీ పునరుజ్జీవనానికి భూ సేకరణ
Follow Us On: Youtube


