మావోయిస్టు లేఖపై స్పందించిన మంత్రి దుర్గేష్

కలం, వెబ్​ డెస్క్​ : ఆంధ్రప్రదేశ్ మంత్రులకు మావోయిస్టుల పేరుతో అందిన బెదిరింపు లేఖల వ్యవహారం రాష్ట్రంలో కలకలం రేపుతోంది. ఈ లేఖపై పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ (Kandula Durgesh) స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టుల (Maoists) పేరిట వచ్చిన ఈ లేఖల వల్ల తన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

తాను బాధ్యతలు నిర్వహిస్తున్నది ఒక చిన్న శాఖ అని, అటు వ్యక్తిగతంగా కానీ ఇటు శాఖాపరంగా కానీ తాను ఎలాంటి తప్పులు చేయలేదని మంత్రి తెలిపారు. అటువంటప్పుడు మావోయిస్టులు తనకు లేఖ రాయాల్సిన అవసరం ఏముంటుందని ఆయన ప్రశ్నించారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే ఇటువంటి లేఖలు రాసి ఉండవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ లేఖల వెనుక ఉన్న అసలు వ్యక్తులు ఎవరనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారని మంత్రి దుర్గేష్ (Kandula Durgesh) తెలిపారు.

 Read Also: మనం ఎక్కడ చమురు కొనాలో అమెరికా చెప్పడమేంటి : రాహుల్ గాంధీ

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>