మోదీ ఆ విషయంలో గ్రేట్.. పుతిన్ ప్రశంసలు!

కలం, వెబ్ డెస్క్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు. “మోదీ ప్రపంచ స్థాయి నాయకుడు. ఆయనతో నాకు వ్యక్తిగత, గొప్ప స్నేహం ఉంది. అయినప్పటికీ ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని వెంటనే ముగించాలని చెబుతూ వస్తున్నారు. రెండు దేశాలకు పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని చర్చలతో సాధించుకోవాలని సూచిస్తున్నారు. అందుకే ఆయన యుద్ధం విషయంలో తటస్థంగా ఉన్నారు. ఈ విషయంలో మోదీ గ్రేట్. రష్యా, ఉక్రెయిన్ దేశాల ప్రయోజనాలు దెబ్బతినకుండా యుద్ధాన్ని ముగించాలన్నదే మోదీ (Modi) ఆలోచన. యుద్ధాన్ని శాంతియుత చర్చల ద్వారా నివారించాలన్న మోదీ ఆలోచన ఎంతో గొప్పది. అందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నా” అన్నారు.

భారతీయులకు గర్వకారణం: అమిత్ షా

రష్యా అధ్యక్షుడు పుతిన్ (Vladimir Putin) వ్యాఖ్యలు ప్రధాని మోదీని అభినందిస్తూ చేసిన వ్యాఖ్యలు దేశానికి గర్వకారణమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) అన్నారు. ప్రపంచ శాంతి కోసం మోదీ ఎలా పాటుపడుతున్నారో పుతిన్ వ్యాఖ్యల ద్వారా అర్థమవుతోందన్నారు. గాంధీజీ జయంతి రోజున పుతిన్ నుంచి వెలువడిన ప్రకటన.. మోదీ ప్రపంచానికి శాంతి, అహింస సూత్రాలను ప్రపంచ వ్యాప్తంగా ఎలా ప్రచారం చేస్తున్నారో తెలుస్తుందన్నారు. ప్రపంచంలో పలు చోట్ల యుద్ధాలు జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో యుద్ధ క్షేత్రాల్లో కంటే పరస్పర చర్చల ద్వారానే సమస్యలకు పరిష్కారం కనుగొనవచ్చని మోదీ బలంగా చెబుతూ వస్తున్నారని షా వివరించారు. ఎక్కడ ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకున్నా.. భారత్ వైఖరి ఇదే అన్నారు.

Also Read : షెడ్యూల్‌కే మురిసిపోతున్నారు.. పాక్‌పై పార్థివ్ పటేల్ సెటైర్లు!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>