పారిశుద్ధ్య‌ కార్మికులకు బీజేపీ నేత‌ల‌ సన్మానం

కలం, నిర్మల్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ‘సేవా సంకల్ప అభియాన్‌’(Seva Sankalp Abhiyan)లో భాగంగా జిల్లా బీజేపీ దళిత మోర్చా ఆధ్వర్యంలో సోన్ మండలం న్యూ వెల్మల్ గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య‌ కార్మికులను శుక్రవారం ఘనంగా సన్మానించారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉండేందుకు, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు పారిశుద్ధ్య‌ కార్మికులు అందిస్తున్న సేవలు ఎంతో విలువైనవని పేర్కొన్నారు. ప్రతిరోజూ నిరంతరం శ్రమిస్తూ పరిసరాల పరిశుభ్రతకు పాటుపడుతున్న కార్మికుల కృషి అభినందనీయమన్నారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు సాదు ప్రభాకర్, గ్రామ సర్పంచ్ రాచకొండ సాగర్, మండల అధ్యక్షుడు మార గంగారెడ్డి, ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గంగారపు అమృత్‌, వివిధ గ్రామాల సర్పంచులు నరేష్, గంగాధర్, విలాస్‌ నాయకులు రమేష్, నాగయ్య, నర్సారెడ్డి, శ్రవణ్‌రెడ్డి, సాయన్న, సవీన్, ఉదయ్, నరసయ్య, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

Also Read : లొవ్లినా పంచ్.. పసిడి పతకం!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>