కలం, వెబ్‌డెస్క్: విశాఖ పట్నంలోని రుషికొండ బీచ్ (Rushikonda Beach) లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సముద్ర తీరంలో సరదాగా గడిపేందుకు స్నేహితులతో వచ్చిన ముగ్గురు విద్యార్థులు సముద్రంలో గల్లంతయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం గాంధీ జయంతి సందర్భంగా సెలవు కావడంతో మధురవాడలోని మల్లయ్యపాలెంకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థులు రుషికొండ ఐటీ హిల్స్ సమీపంలోని సముద్ర తీరానికి వచ్చారు.
అక్కడ సరదాగా నీళ్లల్లో ఆడుకుంటూ ఉండగా సూర్య ప్రకాశ్ (14), నితీశ్ (15), ప్రశాంత్ (14) సముద్రంలో కొట్టుకుపోయారు. వెంటనే మిగతా విద్యార్థులు కేకలు వేశారు. గమనించిన స్థానికులు అక్కడికి చేరుకొని మెరైన్, పీఎం పాలెం పోలీసులు, లైఫ్ గార్డు సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం విద్యార్థుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
Also Read : లొవ్లినా పంచ్.. పసిడి పతకం!
Follow Us On : WhatsApp

