Mobile Popup Ad
Mobile Popup Ad

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన కేంద్రం

కలం, వెబ్ డెస్క్: విశాఖ స్టీల్ ఘోర ప్రమాదంపై కేంద్ర ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మృతిచెందిన కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన ఉద్యోగులకు రూ.10 లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్లు తెలిపారు. ఉద్యోగి రిటైర్మెంట్ వరకు క్వార్టర్స్ లో నివాసం ఉండేందుకు అవకాశం కల్పించారు. ఈ మేరకు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద (Vizag Steel Plant) ఘటనపై ప్రధాని మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో సోమవారం మెటల్ లిక్విడ్ ల్యాడల్ పేలడంతో ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.

భయానక దృశ్యాలు..

సుమారు 1500 డిగ్రీల వేడి కలిగిన ద్రవీభవించిన స్టీల్ కార్మికులపై పడటంతో భయానక దృశ్యాలు చోటుచేసుకున్నాయి. మరుగుతున్న స్టీల్‌లో చిక్కుకుని కార్మికులు సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదంలో 9 మంది చనిపోయారు. స్టీల్‌ప్లాంట్‌లో ఎస్‌ఎంఎస్-2, ఎస్‌టీసీ-3 హీట్ ఎఫ్‌జీలో ఈ ప్రమాదం జరిగింది. స్టీల్‌ప్లాంట్‌లో ఉక్కు ద్రవాన్ని లిఫ్ట్ చేస్తుండగా సాయంత్రం 4.15 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ (Vizag Steel Plant) అగ్ని ప్రమాదంలో మృతి చెందిన మృతదేహాలను విశాఖ కేజీహెచ్‌కు పోలీసులు తరలించనున్నారు. రేపు శవపరీక్ష అనంతరం పోలీసులు కుటుంబసభ్యులకు మృతదేహాలను అప్పగించనున్నారు.

సీఎం కీలక ఆదేశాలు..

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై వెంటనే అధికారులతో మాట్లాడారు. పలువురు కార్మికులు చనిపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. స్టీల్‌ ప్లాంట్‌లో ప్రమాదంపై సీఎం చంద్రబాబు సీఎస్‌ సాయిప్రసాద్, ఉన్నతాధికారులు, విశాఖ కలెక్టర్‌తో సమీక్ష నిర్వహించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఈ ఘటనపై ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామితో సీఎం చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కేంద్రమంత్రిని కోరారు. ఈ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రమాదంలో కార్మికులు మరణించడం తీర‌ని లోటు అని మంత్రి లోకేశ్‌ పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు.

నేడు ఘటనాస్థలికి పవన్, లోకేశ్..

నేడు విశాఖ స్టీల్ ప్లాంట్​లో ప్రమాదం రీత్యా పర్యటనకు డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేశ్ రానున్నారు. మృతుల కుటుంబసభ్యులను లోకేశ్‌, పవన్‌ పరామర్శించనున్నారు. అనంతరం క్షతగాత్రులను పరామర్శించి పరిస్థితిని సమీక్షించనున్నారు. ఈ ప్రమాదంపై హోంమంత్రి అనిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో ప్రమాదంపై కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ఆరా తీశారు. స్టీల్‌ప్లాంట్‌లో జరిగిన ప్రమాదం చాలా దురదృష్టకరమని పేర్కొన్నారు. ఈ ప్రమాదం దృష్ట్యా నేడు తిరుపతిలో తలపెట్టిన కూటమి ప్రభుత్వ బహిరంగ సభ వాయిదా పడింది.

Read Also: ఇండియా కూటమి పార్టీలపై రాహుల్ అసంతృప్తి

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>