కలం, వెబ్ డెస్క్ : శాంతి చర్చల్లో భాగంగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు కొన్నాళుగా బ్రేక్ పడింది. ఈ క్రమంలో ఆయా దేశాలతో పాటు ప్రపంచం కూడా ప్రశాంతంగా ఉంది. అయితే, ఇప్పుడు మళ్లీ పశ్చిమ ఆసియా దేశాల్లో అగ్గి రాజుకుంది. సోమవారం రోజు ఇజ్రాయెల్, ఇరాన్ దేశాలు (israel – iran tensions) ఒకదానిపై ఒకటి తీవ్రదాడులు చేసుకున్నాయి. ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడికి దిగగా.. ఇరాన్ లోని పలు నగరాలపై ఇజ్రాయెల్ డ్రోన్ దాడులతో విరుచుకుపడింది. కాగా, కాల్పుల విరమణ కొనసాగుతున్న వేళ ఇలాంటి యుద్ధవాతావరణం మళ్లీ నివురుగప్పుకోవడం ఆందోళన రేకెత్తిస్తోంది.
ఈ పరిస్థితులపై సమాచారం తెలిసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరు దేశాల తీరును ఖండించారు. దాడులు నిలిపివేయాలని ఇజ్రాయెల్, ఇరాన్ లకు హెచ్చరికలు జారీ చేశారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నేతన్యాహుకు ట్రంప్ ఫోన్ చేసి ఆరా తీశారు. దీంతో రెండు దేశాలు దాడులను ఆపేశాయి. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం తమ పౌరులకు పలు సూచనలు జారీ చేసింది. ఇరాన్, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఆ దేశాలకు వెళ్లే ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని.. అనవసర టూర్లు రద్దు చేసుకోవాలని కోరింది. ఆ దేశాల్లో ఉన్న భారతీయులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా భారత్ కు రావాలని సూచించంది.

