Mobile Popup Ad
Mobile Popup Ad

భయంకరమైన రక్తపాతం.. విశ్వక్‌సేన్ కల్ట్ టీజర్‌పై రచ్చ..!

కలం, డెస్క్ : రోజురోజుకూ సినిమాల్లో కంటెంట్ పక్కకు పోయి రక్తపాతమే కనిపిస్తోంది. చూడటానికి కూడా భయపడేలా రక్తపాతంతో నింపేస్తున్నారు. ఇప్పుడు విశ్వక్ సేన్ (Vishwak Sen) హీరో కమ్ డైరెక్టర్ గా తీస్తున్న మూవీ కల్ట్ రెడ్ బ్యాండ్. తాజాగా మూవీ టీజర్ (Cult Teaser) ను రిలీజ్ చేశారు. ఇది మరీ టూమచ్ రక్తపాతంతో నింపేశారు. ఓ పబ్ లో అందరూ డ్యాన్స్ చేస్తుండగా.. సడెన్ గా మర్డర్లు జరిగిపోతుంటాయి. ఇష్టం వచ్చినట్టు నరికేస్తుంటారు. కత్తులతో ఆడవారి బాడీలను ముక్కలు చేయడాన్ని చూపించారు.

ఇలా కొందరు చంపుతుంటే మధ్యలో విశ్వక్ సేన్ ఎంట్రీ ఇస్తాడు. అలా చంపుతున్న వారిని అతి భయంకరంగా విశ్వక్ చంపడాన్ని చూపించాడు. ‘వీడెవడు మామ వాళ్ల కంటే సైకో గాడిలా ఉన్నాడు’ అని ఓ నటుడు చెప్పడం ఇందులో చూడొచ్చు. దీన్ని బట్టి విశ్వక్ పాత్రను ఎలా డిజైన్ చేశారో అర్థం అవుతోంది. ఈ మధ్య వైలెన్స్ ఉన్న సినిమాలు కొన్ని ఆడటంతో.. చాలా మంది హీరోలు అదే దారిలో నడుస్తున్నారు.

ఇప్పుడు విశ్వక్ సేన్ కూడా కల్ట్ లో మరీ భయపెట్టేలా ఉన్న సీన్లలో నటించడం చూసి అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంత రక్తపాతం ఏంటి.. అసలు కథ లైన్ చెప్పకుండా టీజర్ (Cult Teaser) మొత్తం హింసతో నింపేశారంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. ఇంకొందరేమో జెన్ జీ కిడ్స్ ను ఆకట్టుకునేందుకు ఇలాంటి రక్తపాతం సినిమాను తీశాడేమో అంటున్నారు. ఇలా ఈ సినిమాతో టాక్ ఆఫ్‌ ద టౌన్ అయిపోయాడు విశ్వక్ సేన్.

Read Also: బట్టలు ఆడవారి క్యారెక్టర్‌ను డిసైడ్ చేయవు : నటుడు శివాజీ

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>