తెలుగు సత్తా ఏంటో బిల్స్ గేట్స్‌కు చూపించాం: కేఏ పాల్

కలం, వెబ్ డెస్క్: మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌ పర్యటనపై ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఢిల్లీలో జరుగుతున్న అంతర్జాతీయ ఏఐ సమ్మిట్‌లో బిల్ గేట్స్‌ను గేటు బయటే ఆపేశారని, ఆయనను లోపలికి అనుమతించకపోవడం ద్వారా తెలుగు సత్తా ఏంటో బిల్స్ గేట్స్‌కు చూపించామని ఆయన కామెంట్ చేశారు. కోట్లాది మంది ప్రాణాలు తీసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని అడ్డుకున్నందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తాను ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు.

బిల్‌గేట్స్‌ (Bill Gates)ను భారత్ నుంచి బహిష్కరించాలని, దేశ ప్రయోజనాలను పణంగా పెట్టవద్దని తాను ఐదు రోజుల క్రితమే డిమాండ్ చేశానని కేఏ పాల్ గుర్తుచేశారు. మీడియా మద్దతుతో తాను తీవ్రంగా వ్యతిరేకించగలిగానని ఆయన అన్నారు. ముఖ్యంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిల్‌గేట్స్‌కు ప్రాధాన్యత ఇవ్వడాన్ని ప్రశ్నించానని కేఏ పాల్ (KA Paul) అన్నారు.

Read Also: మా ఆఫీసులో మీటింగ్ పెడతావా.. మహిళా ఉద్యోగిపై రెచ్చిపోయిన నేత

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>