epaper
Sunday, February 22, 2026
epaper

అడ్డంగా బుక్కైన బీజేపీ ఎమ్మెల్యే.. రూ. 5 లక్షల లంచం తీసుకుంటుండగా పట్టివేత

కలం, వెబ్ డెస్క్: కర్ణాటక (Karnataka)లోని శిరహట్టి నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే చంద్రు లమానీ (Chandru Lamani) రూ. 5 లక్షల లంచం తీసుకుంటుండగా లోకాయుక్త పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కాంట్రాక్టర్ విజయ్ పూజార్ నుంచి పనుల క్లియరెన్స్ కోసం మొత్తం రూ. 11 లక్షల లంచం (Bribe) డిమాండ్ చేశాడు. శనివారం రూ. 5 లక్షలు తీసుకుంటుండగా అడ్డంగా దొరికిపోయాడు. ఎమ్మెల్యేతోపాటు ఆయన వ్యక్తిగత సహాయకులు మంజునాథ్ వాల్మీకి, గురునాయక్‌లను కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఆపరేషన్ సందర్భంగా లోకాయుక్త పోలీసులు కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసిన అధికారులు, ఈ అక్రమ లావాదేవీలో ఎమ్మెల్యే (Chandru Lamani) పాత్రపై లోతుగా విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం నిందితులు ముగ్గురిని విచారిస్తూ స్టేట్‌మెంట్లను రికార్డ్ చేస్తున్నారు.

కర్ణాటకలో అవినీతిపై జరుగుతున్న పోరాటంలో భాగంగా ఈ అరెస్ట్ ఒక కీలక పరిణామంగా మారింది. ప్రజల ఆస్తులను కాపాడటానికి తాము కట్టుబడి ఉన్నామని లోకాయుక్త అధికారులు తేల్చి చెప్పారు.

Read Also: షర్ట్‌లెస్ నిరసనపై బీజేపీ పోరు : దేశవ్యాప్తంగా ఉద్రిక్తత

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>