కలం, వెబ్ డెస్క్ : క్రికెట్ దిగ్గజం, ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli)పై ఓ యువతి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాను విరాట్ కోహ్లీ వల్ల గర్భవతిని అయ్యానంటూ సదరు యువతి ఒక వీడియోను విడుదల చేయడంతో నెటిజన్లు ఒక్కసారిగా అవాక్కయ్యారు. గతంలో పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’కు గెస్ట్ గా వచ్చి సందడి చేసిన ఈ యువతి, ఇప్పుడు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచింది.
హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఈ యువతి కొంతకాలం క్రితం దుబాయ్‌కు వెళ్లినట్లు సమాచారం. అయితే ఈ వీడియోను పోస్ట్ చేసే ముందే, దీనివల్ల తాను తీవ్రస్థాయిలో ట్రోలింగ్‌కు గురవుతానని తనకు తెలుసని ఆమె పేర్కొనడం గమనార్హం. ఊహించిన విధంగానే ఈ వీడియో బయటకు వచ్చినప్పటి నుండి విరాట్ కోహ్లీ (Virat Kohli) అభిమానులు ఆమెపై విరుచుకుపడుతున్నారు.
కేవలం పబ్లిసిటీ కోసమే ఆమె ఇలాంటి తప్పుడు ప్రచారానికి తెరలేపిందని, సెలబ్రిటీల ప్రతిష్టను దిగజార్చడమే ఆమె లక్ష్యమని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఎటువంటి ఆధారాలు లేకుండా ఒక అంతర్జాతీయ స్థాయి క్రీడాకారుడిపై ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
Read Also: CSK అభిమానులకు బ్యాడ్ న్యూస్.. IPL మ్యాచ్ లకు ధోని దూరం!
Follow Us On : WhatsApp

