Mobile Popup Ad
Mobile Popup Ad

కవిత కొత్త పార్టీ.. టీపీసీసీ చీఫ్ రియాక్ష‌న్ ఇదే!

క‌లం, వెబ్ డెస్క్‌: జాగృతి చీఫ్ క‌ల్వ‌కుంట్ల క‌విత కొత్త పార్టీపై టీ పీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar) స్పందించారు. క‌విత పార్టీ పెట్ట‌డాన్ని స్వాగ‌తిస్తూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టుకోవచ్చని మ‌హేశ్ కుమార్ వ్యాఖ్యానించారు. అయితే ప్ర‌జ‌లు ఆద‌రిస్తేనే పార్టీలు మ‌నుగ‌డ సాగిస్తాయ‌ని చెప్పారు. సోద‌రి క‌విత (Kavitha) పార్టీ పెట్టినా, ఇంకా ఏ ఇత‌ర రాజ‌కీయ పార్టీలు వ‌చ్చినా కాంగ్రెస్ పార్టీ వాటిని స్వాగ‌తిస్తుంద‌న్నారు. ప్ర‌జా స్వామ్యంలో రాజ‌కీయ పార్టీలు నాణ్య‌త‌తో ప‌ని చేసిన‌ప్పుడే ప్ర‌జ‌ల‌కు న్యాయం జ‌రుగుతుంద‌ని తెలిపారు.

ప్ర‌జా సేవ చేయాల‌న్న దృక్ప‌థంతో రాజ‌కీయాల్లోకి వ‌చ్చినా, పార్టీలు పెట్టినా మంచిదేన‌ని టీపీసీసీ చీఫ్ (TPCC Chief) వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఎన్ని పార్టీలు వ‌చ్చినా కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ చెక్కు చెద‌ర‌ద‌ని స్ప‌ష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) నేతృత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న సంక్షేమం, ఉచిత బ‌స్సు, రైతుల‌కు రాయితీలు, స‌న్న బియ్యం, రేష‌న్ కార్డులు, ఇందిర‌మ్మ ఇండ్లతో ప్ర‌జ‌లు ఎంతో సంతోషంగా ఉన్నార‌న్నారు. వీట‌న్నింటితో కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకు చిర‌స్థాయిగా ఉంటుంద‌న్నారు. రానున్న ఎన్నిక‌ల్లో కూడా ఎన్ని రాజ‌కీయ పార్టీలు వ‌చ్చినా కాంగ్రెస్ పార్టీ 80 శాతం సీట్లు గెలుచుకొని మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు.

Read Also: పురుషాధిక్య రాజకీయాల్లో.. నారీ భేరీ

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>