కలం, వెబ్ డెస్క్ : ఐపీఎల్ (IPL 2026) సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో హైదరాబాద్ సీపీ సజ్జనార్ (CP Sajjanar) క్రికెట్ అభిమానులకు కీలక విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. బెట్టింగ్ ఊబిలో పడి బతుకును ఛిత్రం చేసుకోవద్దని కోరారు. క్రికెట్ ను కేవలం క్రీడలాగే ఆస్వాదించాలని.. బెట్టింగ్ లకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని సజ్జనార్ కోరారు. గతంలో బెట్టింగ్ పై ప్రచారం నిర్వహించే వందలాది యాప్ లను నిషేధించామన్నారు.
అయితే, ఇప్పుడు టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా వేదికగా బెట్టింగ్ దందా కొత్త రూపం దాల్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం డబ్బు కోసం బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేసే సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. ఆన్ లైన్ పై మాత్రమే కాకుండా ఫామ్ హౌజ్ లు, రహస్య ప్రాంతాల్లో సాగే ఆఫ్ లైన్ బెట్టింగ్ పై కూడా పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టినట్టు వెల్లడించారు. బెట్టింగ్ వల్ల అప్పులపాలై కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి తెచ్చుకోవద్దని కోరారు. ఎవరైనా బెట్టింగ్ పాల్పడుతున్నట్లు తెలిస్తే వెంటన్ డయల్ 100 లేదా వాట్సాప్ నంబర్ 94906 16555 కు సమాచారం ఇవ్వాలని సీపీ సజ్జనార్ (CP Sajjanar) సూచించారు.
Read Also: CSK అభిమానులకు బ్యాడ్ న్యూస్.. IPL మ్యాచ్ లకు ధోని దూరం!
Follow Us On: Instagram

