నిర్మల్‌లో కొనసాగుతున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల పోరాటం

కలం, నిర్మల్‌: జాతీయ ఆరోగ్య మిషన్  ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన నిరవధిక సమ్మె (NHM Employees Strike) కొనసాగుతోంది. నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట ఎన్‌హెచ్‌ఎం జేఏసీ ఆధ్వర్యంలో ఏఎన్‌ఎంలు, ఆయుష్‌ వైద్యులు చేపట్టిన ఈ సమ్మె బుధవారం నాటికి 29వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఎన్‌హెచ్‌ఎం పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. సర్వీసుల క్రమబద్ధీకరణ పూర్తయ్యే వరకు 100 శాతం గ్రాస్‌ శాలరీ చెల్లించాలని కోరారు. ఉద్యోగ, ఆరోగ్య భద్రత కల్పించడంతోపాటు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>