Mobile Popup Ad
Mobile Popup Ad

12 ఏళ్లుగా అదే చర్చ జరుగుతోంది.. ఫ్యాన్స్‌కు కోహ్లీ మాజీ ప్రేయసి వార్నింగ్

కలం, వెబ్​ డెస్క్​: విరాట్ కోహ్లీ (Virat Kohli) ఇటీవల సోషల్ మీడియాలో ఓ జర్మన్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఫోటోను ‘లైక్’ చేసిన విషయం తెలిసిందే. ఈ ఇష్యూపై తాజాగా కోహ్లీ మాజీ ప్రేయసి బ్రెజిలియన్ మోడల్ ఇజబెల్ లైట్ (Izabelle Leite) ఘాటుగా స్పందించారు. ఇజబెల్ లైట్ అనుష్క శర్మ వంటి వారితో ఉన్న సంబంధాలను ప్రస్తావిస్తూ.. ‘మహిళల విషయంలో కోహ్లీ అభిరుచి ఎప్పుడూ హుందాగా ఉంటుంది. గత 12 ఏళ్లుగా ఇదే చర్చ జరుగుతోంది.. ఇప్పటికీ అభిమానులు ఆ పాత విషయాన్ని ఎందుకు మర్చిపోలేకపోతున్నారు?” అంటూ ఆమె అసహనం వ్యక్తం చేశారు.

కోహ్లీ ఇటీవల జర్మన్ వ్లాగర్ లిజ్‌లాజ్ పోస్ట్‌ను లైక్ చేసి ఆ తర్వాత అన్‌లైక్ చేయడం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ఈ ఇష్యూలోకి ఫ్యాన్స్ కోహ్లీ మాజీ ప్రేయసిని లాగారు. దీంతో ఇజబెల్ (Izabelle Leite) స్పందిస్తూ.. ఆ బంధం ముగిసి 12 ఏళ్లు అవుతున్నా ఇంకా తన పేరును ఈ వివాదాల్లోకి లాగడం సరికాదని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఇజబెల్ లైట్ వివాహం చేసుకుని దోహాలో తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటున్నారు. మరోవైపు విరాట్ కోహ్లీ అనవసరంగా విమర్శలకు గురవుతున్నందుకు తాను విచారిస్తున్నట్లు తెలిపింది.

Read Also: ప్రకాశ్ రాజ్‌ను చంపేయండి.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>